Nissan Magnite Facelift: మార్కెట్‌లోకి నిస్సాన్ నయా కారు ఎంట్రీ.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!
Nissan Magnite Facelift: నిస్సాన్ కంపెనీ ఇటీవల తన మాగ్నైట్ కారుతో భారత్‌లో భారీ డిమాండ్‌ను సంపాదించుకుంది.

Nissan Magnite Facelift: మార్కెట్‌లోకి నిస్సాన్ నయా కారు ఎంట్రీ.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!
Nissan Magnite Facelift: నిస్సాన్ కంపెనీ ఇటీవల తన మాగ్నైట్ కారుతో భారత్‌లో భారీ డిమాండ్‌ను సంపాదించుకుంది. దేశంలో విపరీతంగా సందడి చేస్తున్న ఈ కారు ఇప్పుడు విదేశాల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. నిస్సాన్ ఇప్పుడు సౌదీ అరేబియాలో మాగ్నెట్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ మార్కెట్‌లోలెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఫేస్‌లిఫ్ట్‌ని పొందిన మొదటిది. సౌదీ అరేబియాలో లాంచ్ చేసిన మాగ్నైట్ భారతదేశంలో విక్రయించే కారుతో సమానంగా ఉంటుంది. స్టీరింగ్ ఎడమ వైపున ఉంది.
జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ 2020లో భారతదేశంలో మాగ్నైట్ కారును విడుదల చేసింది. అప్పటి నుండి ఈ ఎస్‌యూవీ భారీ పురోగతిని సాధిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఫేస్‌లిఫ్ట్‌తో దేశంలో ప్రారంభించారు. బెంగళూరులో నిస్సాన్ మాగ్నైట్ ప్రస్తుత ధర రూ.7.39 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ.14.73 లక్షలు ఆన్-రోడ్.
సౌదీ అరేబియాలో 66,699 రియాల్స్‌కు విడుదల చేశారు. భారత కరెన్సీలో సుమారుగా. రూ. 15,28,000 కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో 72 పిఎస్ పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మరో 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 పిఎస్ హార్స్ పవర్, 160 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఉంది. ఇది వేరియంట్‌లను బట్టి 17.4 నుండి 20 kmpl మైలేజీని అందిస్తుందని అంచనాలు చెబుతున్నాయి.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్ల విషయానికి వస్తే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4-కలర్ యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రిమోట్ ఇంజన్ స్టార్ట్, ఎయిర్ ఐయోనైజర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తుంది. సేఫ్ఠీ విషయానికి వస్తే 6-ఎయిర్‌బ్యాగ్స్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో డిమ్మింగ్, 360-డిగ్రీ కెమెరాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ కారు ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది.