New MG4 Car: ఎంజీ మోటర్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. గట్టి ఫీచర్లున్నాయండోయ్.. మీరు ఓ లుక్కేయండి..!

New MG4 Car: ఎంజీ మోటార్ తన కొత్త తరం MG4 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Update: 2025-03-22 13:15 GMT
New MG4 Car: ఎంజీ మోటర్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. గట్టి ఫీచర్లున్నాయండోయ్.. మీరు ఓ లుక్కేయండి..!
  • whatsapp icon

New MG4 Car: ఎంజీ మోటార్ తన కొత్త తరం MG4 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారును మొదటగా చైనా మార్కెట్లో విడుదల చేయగా, ఆ తర్వాత ఇతర మార్కెట్లలో కూడా దీని విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇంటీరియర్, టెక్నాలజీ, పవర్‌ట్రెయిన్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు. MG4ని ఆటో ఎక్స్‌పో 2023లో ఇండియాలో ప్రవేశపెట్టారు.

కొత్త MG4 లుక్ మునుపటి కంటే మృదువైనది, గుండ్రంగా ఉంటుంది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, స్లిమ్మర్ సైడ్ వెంట్‌లు, పెద్ద ఇన్‌టేక్‌తో అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్‌ ఉంటుంది. వెనుక భాగం మరింత ప్రముఖంగా కనిపిస్తుంది. దీని వెనుక హాంచ్ కూడా ఉంది. పుల్-స్టైల్ డోర్ హ్యాండిల్స్ అలాగే ఉంచారు. విండోలైన్ ఇప్పుడు వెనుక క్వార్టర్ గ్లాస్ వైపు పైకి లేస్తుంది.

కొత్త MG4 వెనుక భాగంలో కనెక్ట్ చేసిన టెయిల్-ల్యాంప్ డిజైన్‌ ఉంది, ఇది లిప్-స్పాయిలర్ ఎలిమెంట్‌తో వస్తుంది. టెయిల్‌గేట్‌లో వెనుక విండ్‌షీల్డ్ క్రింద జత చేసి ఉంటుంది. అలానే మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కారు పొడవు 4,395 మిమీ, వెడల్పు 1,842 మిమీ, ఎత్తు 1,551 మిమీ. దీని వీల్ బేస్ 2,750 మిమీ. ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే 117 మిమీ పొడవు, 6 మిమీ వెడల్పు, 45 మిమీ పొడవు, వీల్‌బేస్ కూడా 45 మిమీ పెరిగింది.

ఎంజీ4 ఎలక్ట్రిక్ సెడాన్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో ఒకే మోటారు ఉంది. ఇది 161 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే బ్యాటరీ ప్యాక్, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుత మోడల్ కంటే 7 బిహెచ్‌పి తక్కువ పవర్ ఇస్తుంది. మునుపటి మోడళ్లలో అందుబాటులో ఉన్నటువంటి ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌తో సహా, రాబోయే నెలల్లో ఇతర పవర్‌ట్రైన్ ఎంపికలను కూడా పరిచయం చేయాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News