Kia: ఏప్రిల్ 1లోపే కొనేయండి.. భారీగా పెరగనున్న కియా కార్ల ధరలు..!
Kia: మారుతి సుజుకి, టాటా మోటార్స్, నిస్సాన్ తర్వాత ఇప్పుడు కియా ఇండియా కూడా కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 3శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Kia: ఏప్రిల్ 1లోపే కొనేయండి.. భారీగా పెరగనున్న కియా కార్ల ధరలు..!
Kia: మారుతి సుజుకి, టాటా మోటార్స్, నిస్సాన్ తర్వాత ఇప్పుడు కియా ఇండియా కూడా కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 3శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్కెట్ల వర్గాల లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. వస్తువుల ధరలు పెరగడం,సరఫరా గొలుసు ధరల పెరుగుదల కారణంగా, దాని అన్ని కార్ల ధరలను పెంచవలసి వస్తుంది. షిప్పింగ్, రవాణా , లాజిస్టిక్స్ వంటి ఖర్చులు పెరిగాయని, స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ ధరల పెరుగుదల కారణంగా వాహనాల ధరలు కూడా పెరుగుతున్నాయని కంపెనీ తెలిపింది.
కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. ఒక బ్రాండ్‌గా, మా కస్టమర్‌లకు గొప్ప విలువ, నాణ్యతను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా కస్టమర్‌లకు సరసమైన ధరలకు అత్యుత్తమ వాహనాలను అందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. ధరలలో మార్పు మాకు కూడా సవాలుగా ఉంటుంది, అయితే మా వినియోగదారులకు మంచి నాణ్యత, సాంకేతికంగా మంచి వాహనాలను అందించడం కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకొన్నాము.
కియా కంటే ముందు, మారుతి సుజుకి, టాటా మోటార్స్ కూడా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరుగుతున్న ఖర్చుల ఒత్తిడి అన్ని కార్ల కంపెనీలపై పడుతోంది. టాటా మోటార్స్ తన వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల ధరలను 2శాతం పెంచింది. అదే సమయంలో మారుతి సుజుకి ధరలను 4శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇది కాకుండా, నిస్సాన్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ ధరను 4000 రూపాయలు పెంచింది. ఇప్పుడు ధరల పెరుగుదల కార్ కంపెనీల విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ధరల పెరుగుదల వినియోగదారుల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది.