Hero Splendor Vs Honda Shine: స్ప్లెండర్ ప్లస్‌ వర్సెస్ షైన్‌.. ఇంట్రెస్టింగ్ కంపారిజన్.. బెస్ట్ ఏదంటే..?

Hero Splendor Vs Honda Shine: హీరో, హోండా కంపెనీలకు భారతదేశంలో బైక్‌ల పరంగా చాలా మంచి మార్కెట్ ఉంది. రెండు కంపెనీలు ప్రజలకు అధిక మైలేజీనిచ్చే బైక్‌లను తయారు చేస్తున్నాయి.

Update: 2025-03-19 16:45 GMT
Hero Splendor Vs Honda Shine

Hero Splendor Vs Honda Shine: స్ప్లెండర్ ప్లస్‌ వర్సెస్ షైన్‌.. ఇంట్రెస్టింగ్ కంపారిజన్.. బెస్ట్ ఏదంటే..?

  • whatsapp icon

Hero Splendor Vs Honda Shine: హీరో, హోండా కంపెనీలకు భారతదేశంలో బైక్‌ల పరంగా చాలా మంచి మార్కెట్ ఉంది. రెండు కంపెనీలు ప్రజలకు అధిక మైలేజీనిచ్చే బైక్‌లను తయారు చేస్తున్నాయి. అయితే హీరో స్ప్లెండర్, హోండా షైన్ ఈ రెండు కంపెనీలలో ఏ బైక్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఈ విషయంలో ప్రజల్లో చాలా గందరగోళం నెలకొంది. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Hero Splendor Plus

హీరో స్ప్లెండర్ ప్లస్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 5.9 బిహెచ్ పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఈ బైక్‌లో అందించారు. ఈ బైక్‌లో హీరో 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 87 కి.మీ. ఈ బైక్ మైలేజీ గురించి మాట్లాడితే ఈ బైక్‌ లీటర్‌కు 70 కిమీ మైలేజీని ఇస్తుందని హీరో పేర్కొంది. హీరో స్ప్లెండర్ ధర రూ. 77,176 ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది.

Honda Shine

హోండా షైన్‌లో మీరు 4-స్ట్రోక్, SI, BS-VI ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.9 హెచ్‌పి పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు ఈ బైక్‌లో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ వేగం గంటకు 102 కిమీ. మైలేజీ విషయానికి వస్తే హోండా ఈ బైక్ మైలేజ్ లీటరుకు 55 కిమీ. హోండా షైన్ ప్రారంభ ధర రూ.83,251 ఎక్స్-షోరూమ్.

Tags:    

Similar News