Kia Syros Mini Defender: కియా నుంచి మినీ డిఫెండర్.. అద్భుతమైన ఫీచర్స్‌తో టాటాతో పోటీ..!
Kia Syros Mini Defender: ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒక అద్భుతమైన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ. ఈ కారుకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది, అయితే దీని ధర కారణంగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు.

Kia Syros Mini Defender: కియా నుంచి మినీ డిఫెండర్.. అద్భుతమైన ఫీచర్స్‌తో టాటాతో పోటీ..!
Kia Syros Mini Defender: ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒక అద్భుతమైన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ. ఈ కారుకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది, అయితే దీని ధర కారణంగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ ఎస్‌యూవీ ధర కోటి రూపాయల కంటే ఎక్కువ. అందువల్ల, చాలా మందికి ఈ కారు ఒక కలగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మధ్యతరగతి ప్రజల కలలను దృష్టిలో ఉంచుకొని కియా మోటార్స్ తన కొత్త ఎస్‌యూవీ కియా సైరోస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర కేవలం 9 లక్షల రూపాయల నుండి మొదలవుతుంది. ఈ కారు డిజైన్ దాదాపు డిఫెండర్ లాగా ఉంటుంది. ఈ కారు ఇతర ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Kia Syros Engine
కియా సైరోస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లాంచ్ కానుంది. ఇందులో 998 సిసి, 1493 సిసి ఇంజన్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ లీటరుకు 17.65 నుండి 20.75 కిమీల మైలేజీని అందిస్తుంది, ఇది కారుకు మంచి మైలేజీని ఇస్తుంది. ఈ కారులో భద్రత కోసం కియా 6 ఎయిర్‌బ్యాగ్స్, అడాస్ స్థాయి 2.0 టెక్నాలజీ, 16 అటానమస్ సేఫ్టీ ఫీచర్‌లను అందించారు.
Kia Syros Interior
ఈ కారులో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే, హర్మాన్ కార్డాన్ ప్రీమియం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Kia Syros Price
కియా సిరోస్ ధర రూ. 9 లక్షల నుండి మొదలై రూ. 17.80 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది, ఇది వివిధ వేరియంట్లు, ఫీచర్లను బట్టి మారుతుంది.