Best CNG Cars: బడ్జెట్ ధరల్లో బెస్ట్ కార్లు.. పెట్రోల్ అవసరమే లేదు.. రూ. 10 లక్షల నుంచే..!
Best CNG Cars: ప్రజలు సొంత ఇల్లు కొట్టుకోవాలని ఎలా అనుకుంటున్నారో.. ఇంటికో కారు కూడా. అయితే పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యల దృష్ట్యా సిఎన్‌జి కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Best CNG Cars: బడ్జెట్ ధరల్లో బెస్ట్ కార్లు.. పెట్రోల్ అవసరమే లేదు.. రూ. 10 లక్షల నుంచే..!
Best CNG Cars: ప్రజలు సొంత ఇల్లు కొట్టుకోవాలని ఎలా అనుకుంటున్నారో.. ఇంటికో కారు కూడా. అయితే పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యల దృష్ట్యా సిఎన్‌జి కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సిఎన్‌జి కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో పెద్ద కంపెనీలు బడ్జెట్ ధరలో తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నాయి. అలానే కంపెనీలు ఇప్పుడు తమ వాహనాల టాప్ వేరియంట్‌లలో పెట్రోల్-సిఎన్‌జి డ్యూయల్-ఫ్యూయల్ టెక్నాలజీని అందిస్తున్నాయి. అనేక ఫీచర్లతో 10 లక్షల లోపు లభించే సిఎన్‌జి కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Punch
టాటా పంచ్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. ఇది మైక్రో ఎస్‌యూవీ, పెట్రోల్, పెట్రోల్-సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. సన్‌రూఫ్‌తో కూడిన అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్‌ను రూ. 10 లక్షలలోపు సిఎన్‌జిలో కొనుగోలు చేయచ్చు. ఇందులో పెట్రోల్-సిఎన్‌జి పవర్‌ట్రైన్ ఉంటుంది. టాటా పంచ్ సిఎన్‌జి వేరియంట్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సిక్స్-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌ల వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Tata Tigor
పెట్రోల్-సిఎన్‌జి పవర్‌ట్రైన్‌తో అందుబాటులో ఉంది. టాటా టిగోర్ ధర రూ. 9.50 లక్షల ఎక్స్-షోరూమ్. ఈ ధర వద్ద టాటా టిగోర్ టాప్-ఎండ్ ట్రిమ్ XZ ప్లస్ లక్స్ పెట్రోల్-సిఎన్‌జి డ్యూయల్ ఫ్యూయల్ పవర్‌ట్రైన్‌తో వస్తుంది. ఇది సిఎన్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టాటా టిగోర్ సిఎన్‌జిలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎనిమిది-స్పీకర్ సిస్టమ్, ఆటో ఏసీ, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లతో పాటు అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
Maruti Suzuki Dzire
కొత్త మారుతి సుజుకి డిజైర్ సబ్-కాంపాక్ట్ సెడాన్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. కొత్త డిజైర్ VXI, ZXI అనే రెండు వేరియంట్లలో CNG పవర్‌ట్రెయిన్ ఉంది. దీని ధర రూ.9.89 లక్షల ఎక్స్-షోరూమ్. దీని ZXi వేరియంట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ ఓఆర్‌విఎమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వెనుక వెంట్‌లతో ఆటో ఏసీ ఫీచర్లు ఉన్నాయి.