Budget Cars: భారత్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ సన్‌రూఫ్ కార్లు ఇవే..!
Budget Cars: భారత మార్కెట్లో సన్‌రూఫ్ ఉన్న కార్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో ఇది కేవలం లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమై ఉండేది.

Budget Cars: భారత్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ సన్‌రూఫ్ కార్లు ఇవే..!
Budget Cars: భారత మార్కెట్లో సన్‌రూఫ్ ఉన్న కార్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో ఇది కేవలం లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఎంట్రీ లెవల్ SUVలలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా మంది సన్‌రూఫ్ ఉన్న బేసిక్ లెవల్ ఎస్‌యూవీ కార్లకు మొగ్గు చూపుతున్నారు. మరి రూ. 15 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సన్‌రూఫ్ ఎస్‌యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1) కియా సైరోస్ (Kia Cyros):
కియా ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చిన సైరోస్ SUV మంచి స్పందన పొందుతోంది. ఇది రూ.9 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుంచి మొదలవుతుంది. అయితే పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ HTK ప్లస్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.11.50 లక్షలుగా ఉంది.
2) టాటా కర్వ్ (Tata Curvv):
స్టైలిష్ కూపే డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపించే టాటా కర్వ్ SUV కూడా పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. దీని ధర సుమారు రూ.11.87 లక్షలుగా ఉంది. నూతన డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పొచ్చు.
3) ఎంజి ఆస్టర్ (MG Astor):
MG ఆస్టర్ Shine వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ లభిస్తుంది. నవీకరించిన ఈ మోడల్ ధర రూ.12.48 లక్షలు. ఈ SUVలో స్టైల్, సేఫ్టీ, టెక్నాలజీ అన్ని రంగాల్లో మంచి బ్యాలెన్స్ ఉంటుంది.
4) మహీంద్రా XUV 3XO:
మహీంద్రా నుంచి వచ్చిన ఈ సబ్-కాంపాక్ట్ SUV కూడా పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తోంది. దాని ధర సుమారు రూ.12.57 లక్షలుగా ఉంది. డిజైన్, మైలేజ్, ఫీచర్ల పరంగా ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.
5) హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta):
భారత మార్కెట్లో ఎక్కువగా అమ్ముడయ్యే SUVలలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌తో తీసుకొచ్చింది. పెట్రోల్ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. దీని ధర రూ.12.97 లక్షలుగా ఉంది.