కారు డ్రైవింగ్‌ విషయంలో ఈ చెడ్డ అలవాట్లని వదిలేయండి.. సురక్షితంగా ఉంటారు..!

Car Driving: ఇటీవల భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిద్ర కారణంగా కారు ప్రమాదానికి గురయ్యాడు.

Update: 2023-01-05 13:30 GMT

కారు డ్రైవింగ్‌ విషయంలో ఈ చెడ్డ అలవాట్లని వదిలేయండి.. సురక్షితంగా ఉంటారు..!

Car Driving: ఇటీవల భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిద్ర కారణంగా కారు ప్రమాదానికి గురయ్యాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 1.5 లక్షల మంది రోడ్డు మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం ప్రమాదాల్లో ఇది 11 శాతం. రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా ముఖ్యం. ఒక్కోసారి మన చిన్న పొరపాట్ల వల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది. డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఈ చెడు అలవాట్లని వదిలేయండి.

1. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌

రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్ చేయడం భారతదేశంలో సర్వసాధారణంగా మారింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇటీవల నివేదిక ప్రకారం 2021లోనే దేశంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 2,823 మరణాలు సంభవించాయి. తప్పుడు దిశలో డ్రైవింగ్ చేయడం వల్ల ఆ వాహనంతో పాటు ఆ రహదారిపై ఉన్న ఇతర వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.

2. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం

ముందు సీటుకే కాకుండా వెనుక సీటులో కూర్చున్న వాళ్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలోని వివిధ నగరాల్లో వెనుక కూర్చున్న ప్రయాణికులు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. 2021లో నమోదైన 19,800 మరణాలలో 16,397 (83 శాతం) మంది ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్టులు ధరించలేదు.

3. అతివేగం

అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల ప్రమాదం పెరుగుతుంది. 2021లో అతివేగం కారణంగా మరణాలు 23 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం మీద 95,785 ఓవర్ స్పీడ్ ప్రమాదాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా 40,450 మంది మరణించారు.

4. పార్కింగ్ లైట్లు ఉపయోగించకపోవడం

చాలా మందికి పార్కింగ్ లైట్ల ఉపయోగం తెలియదు. మీ వాహనంలో ఏదైనా లోపం ఏర్పడి రోడ్డు మధ్యలో ఆపివేయాల్సి వచ్చినా లేదా తక్కువ వేగంతో నడపాల్సి వచ్చినా ఈ లైట్లను ఉపయోగించాలి. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం వీటిని తప్పుగా ఉపయోగిస్తే జరిమానా విధిస్తారు.

Tags:    

Similar News