Volkswagen Virtus: వోక్స్‌వ్యాగన్ రికార్డ్ అమ్మకాలు.. ప్రతి రోజూ పోటీపడి కొంటున్నారు

Volkswagen Virtus: వోక్స్‌వ్యాగన్ (Volkswagen) ఇండియా వర్టస్ సెడాన్ తమ అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2024లో వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) అమ్మకాలు 2,351 యూనిట్లుగా ఉన్నాయి.

Update: 2024-11-06 11:56 GMT

Volkswagen Virtus

Volkswagen Virtus: వోక్స్‌వ్యాగన్ ఇండియా వర్టస్ సెడాన్ తమ అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2024లో వోక్స్‌వ్యాగన్ వర్టస్ అమ్మకాలు 2,351 యూనిట్లుగా ఉన్నాయి. ఇది సంవత్సరానికి 32 శాతం వృద్ధిని సాధించింది. అలానే వోక్స్‌వ్యాగన్ ఇండియా అక్టోబర్ 2023తో పోలిస్తే 2024 అక్టోబర్‌లో అమ్మకాలలో 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 60 మంది వ్యక్తులు ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కారును కొనుగోలు చేస్తున్నారు. దాని వివరాలను తెలుసుకుందాం.

వోక్స్‌వ్యాగన్ ఇండియా వర్టస్ భారతదేశం అంతటా రోజుకు 60 యూనిట్లను విక్రయిస్తోందని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 50,000 యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. ఆసక్తికరంగా 2024లో ఇప్పటివరకు 17,000 కంటే ఎక్కువ వర్టస్ అమ్ముడయ్యాయి.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభించిన 28 నెలల్లోనే 50,000 విక్రయాల మార్కును సాధించింది.

అయితే, క్షీణిస్తున్న ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో ఇది చాలా కొత్తది. భారత మార్కెట్లో వర్టస్ స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీలతో పోటీపడుతుంది.ఈ సెడాన్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు, రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది. స్టైలింగ్ కూడా ప్రీమియం సెడాన్ కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తుంది. దీని ఆకర్షణను పెంచుతుంది. 

వోక్స్‌వ్యాగన్  వర్టస్ రెండు విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. 1.0-లీటర్ TSI పెట్రోల్ మోటార్ ఉంది, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 113 బీహెచ్‌పి హార్స్ పవర్,  178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని రెండవ ఇంజన్ 1.5-లీటర్ TSI Evo మోటార్, ఇది GT-బ్యాడ్జ్డ్ పెర్ఫార్మెన్స్ లైన్ ట్రిమ్‌కు శక్తినిస్తుంది. ఇది 7-స్పీడ్ DSC ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లింకై ఉంటుంది.

ఫీచర్ల విషయానికొస్తే.. వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10 అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 8 స్పీకర్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, మరిన్నింటిని కలిగి ఉంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి.

Tags:    

Similar News