Volkswagen Taigun Discount: వారెవ్వా.. వోక్స్వ్యాగన్ భారీ ఆఫర్.. రూ. 2.80 లక్షల వరకు డిస్కౌంట్
Volkswagen Taigun Discount: సమాచారం ప్రకారం ఈ నెలలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) పై రూ. 2.80 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది.
Volkswagen Taigun Discount: హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాహనాల కంటే వోక్స్వ్యాగన్ టైగన్ చాలా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో అద్భుతమైన జర్మనీ టెక్నాలజీని ఉపయోగించారు. భారతదేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాహనాలు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. కానీ టెక్నాలజీ, పర్ఫామెన్స్ విషయానికి వస్తే వోక్స్వ్యాగన్ టైగన్ వీటన్నింటిని అధిగమిస్తుంది. ఈ కారు కొనాలనే ఆలోచనలో ఉంటే.. ఈ నెలలో లక్ష రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు.
సమాచారం ప్రకారం ఈ నెలలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌పై రూ. 2.80 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు MY 2023 వోక్స్వ్యాగన్ టైగన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ల కోసం కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. మీరు వోక్స్వ్యాగన్ టైగన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, దాని ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
వోక్స్వ్యాగన్ టైగన్ 2 ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. మొదటిది 115bhp పీక్ పవర్, 175ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఉంటుంది. రెండవది 150బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఉంది. ఈ ఎస్‌యూవీలో శక్తివంతమైన ఇంజన్‌తో పాటు యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ కూడా ఉంది. కారు ఇంజిన్ ఆటోమేటిక్ ,మాన్యువల్ గేర్‌బాక్స్‌లతో అటాచ్ చేసి ఉంటుంది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కస్టమర్లకు డైనమిక్ లైన్, పెర్ఫార్మెన్స్ లైన్ అనే 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
వోక్స్వ్యాగన్ టైగన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ. 11.70 లక్షల నుండి రూ. 19.74 లక్షల వరకు ఉంటుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే వోక్స్వ్యాగన్ టిగన్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఈ వాహనంలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడితే టైగన్‌లో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.