Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 లాంచ్.. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే ?
Royal Enfield Electric Bike: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర (Electric Bike) వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీలు కూడా సరికొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
Royal Enfield Electric Bike: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీలు కూడా సరికొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్, ఓలా, ఏథర్ వంటి కంపెనీలు ఇప్పుడు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇటలీలోని మిలన్ నగరంలో జరగనున్న EICMA మోటార్ షోకి ముందు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6ని పరిచయం చేసింది. ఈ కొత్త బైక్‌లోని అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే, సాధారణ బైక్‌ల కంటే భిన్నంగా ఉండే ప్రత్యేకమైన డిజైన్. దీనికి కంపెనీ 'ఫ్లయింగ్ ఫ్లీ' అని పేరు పెట్టింది. ఇందులోభాగంగా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌గా 'సి6' మోడల్‌ను ఆవిష్కరించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ మీకు 40ల నాటి కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ప్రస్తుతం ఉన్న బైక్‌ల డిజైన్‌కు ఈ బైక్ డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇందులో అనేక కొత్త ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. EICMA 2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ FF.C6 మాత్రమే పరిచయం చేసింది. అయితే దీని బ్యాటరీ, ఛార్జింగ్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ బైక్‌లో టచ్‌స్క్రీన్‌తో కూడిన స్పీడోమీటర్ ఉంది.
ఈ బైక్‌లో ముందు, వెనుక డిస్క్ బ్రేక్ ఉంటుంది. EICMA 2024లో అందించిన రిఫార్మ్స్‌లో, ఒకే ఒక్క సీటు మాత్రమే కనిపించింది. అయితే వెనుక సీటును ఆప్షనల్‌గా అందిచవచ్చని భావిస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్లీ C6 బైక్‌లో భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌ను భారత్ మొబిలిటీ 2025 సమయంలో కూడా విడుదల చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం 2026 మధ్యలో ఈ బైక్‌ను విడుదల చేయవచ్చు.