Honda Elevate: ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు.. వెంటనే వెళ్లి హ్యుందాయ్ ఈ ఎస్ యూవీని కొనేయండి..!
సమీప భవిష్యతులో కొత్త ఎస్ యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇదే మంచి సమయం అని కొందరు చెబుతున్నారు.
Honda Elevate: భారతీయ కస్టమర్లలో ఎస్ యూవీ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. 2024 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారతదేశంలోని మొత్తం కార్ల విక్రయాలలో ఎస్ యూవీ విభాగం మాత్రమే 52శాతం వాటాను కలిగి ఉందంటే వాటి డిమాండ్ ఏంటో అర్థం అవుతుంది. సమీప భవిష్యతులో కొత్త ఎస్ యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇదే మంచి సమయం అని కొందరు చెబుతున్నారు. ప్రముఖ కార్ల తయారీదారు హోండా నవంబర్ నెలలో దాని ప్రసిద్ధ ఎస్ యూవీ ఎలివేట్‌పై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది.
వార్తా వెబ్‌సైట్ ఆటోకార్ ఇండియాలో ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. హోండా ఎలివేట్ కొనుగోలు చేయడం ద్వారా గరిష్టంగా రూ. 86,000 ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. భారతీయ మార్కెట్లో, హోండా ఎలివేట్ హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ఎస్ యూవీలతో పోటీ పడుతుంది. హోండా ఎలివేట్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
హోండా ఎలివేటర్ అనేది 5-సీటర్ కారు, దీని పవర్‌ట్రెయిన్‌గా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 121బీహెచ్ పీ శక్తిని, 145ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజిన్‌లో కస్టమర్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటి ఆప్షన్లను పొందుతారు. హోండా ఎలివేట్ మాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 15.31 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 16.92 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
మరోవైపు, కారు క్యాబిన్‌లో, వినియోగదారులు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ సపోర్ట్ చేసే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందుతారు. ఇది కాకుండా, అందులో ప్రయాణిస్తున్న వారి సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లతో వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లతో కూడా అందించబడింది. హోండా ఎలివేట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 11.69 లక్షల నుండి రూ. 16.71 లక్షల వరకు ఉంటుంది.