Kia Carens Facelift: ఎర్టిగాకు పోటీగా కియా కొత్త కారు.. ఏప్రిల్‌లో లాంచ్..!

Kia Carens Facelift: భారత్‌లో మారుతి సుజుకి ఎర్టిగాకు ఎంపివి సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కియా కేరెన్స్ కూడా ఈ విభాగంలో చేరింది. అయితే ఇప్పుడు కంపెనీ మరోసారి తన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Update: 2025-03-12 13:52 GMT
Kia Carens Facelift

Kia Carens Facelift: ఎర్టిగాను పోటీగా కియా కొత్త కారు.. ఏప్రిల్‌లో లాంచ్..!

  • whatsapp icon

Kia Carens Facelift: భారత్‌లో మారుతి సుజుకి ఎర్టిగాకు ఎంపివి సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కియా కేరెన్స్ కూడా ఈ విభాగంలో చేరింది. అయితే ఇప్పుడు కంపెనీ మరోసారి తన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారుకు సంబంధించిన సమాచారం నిరంతరం బయటకు వస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం కొత్త కారును మార్చి-ఏప్రిల్‌లో విడుదల చేయవచ్చని వార్తలు వచ్చాయి. ఈ కారు ఏప్రిల్‌లో విడుదల కావచ్చని తెలుస్తుంది. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చే నెలలో విడుదల కానుంది, అయితే కంపెనీ ఇంకా దాని గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు. త్వరలో కియా నుండి దీని గురించి సమాచారం అందుతుంది. నివేదికల ప్రకారం.. కేరెన్స్ ఇటీవల ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్‌లో కనిపించింది. ఈసారి కొత్త మోడల్‌లో చాలా పెద్ద మార్పులను చూడచ్చు. ఈసారి కంపెని మారుతి సుజుకి ఎర్టిగాను అధిగమించేందుకు ప్రయత్నిస్తుంది. దీని కోసం, కంపెనీ ఈ కొత్త మోడల్‌లో కొన్ని మంచి ఫీచర్లను కూడా చేర్చనుంది.

పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఫేస్‌లిఫ్ట్ కేరెన్స్‌లో చూడచ్చు. భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, EBDతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు కేరెన్స్ మొదటి, రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు చూడచ్చు. ఈ వాహనంలో 30-అంగుళాల ట్రినిటీ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇందులో రెండు 12.3-అంగుళాల స్క్రీన్లు అలాగే 5-అంగుళాల స్క్రీన్ ఉంటాయి. కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర రూ. 11.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ 3 ఇంజన్ ఎంపికలలో రానుంది. 1.5-లీటర్ డీజిల్, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్‌. సిఎన్‌జి , ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా కేరెన్స్ లాంచ్ అవుతుందని నమ్ముతారు.

కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి ఎర్టిగాతో నేరుగా పోటీపడుతుంది, ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎర్టిగా ఇంజన్ 102 బిహెచ్‌పి పవర్, 136.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. భద్రత కోసం EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్, లోడ్ లిమిటర్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ మోడ్‌లో 20.51kmpl మైలేజీని ఇస్తుంది. సిఎన్‌జిలో 26 km/kg మైలేజీని ఇస్తుంది.

Tags:    

Similar News