Hyundai Venue Sales: మార్కెట్లో మంచి కారు.. హ్యుందాయ్ వెన్యూకి భారీ డిమాండ్..
Hyundai Venue Sales: ఇండియా మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూకి భారీ డిమాండ్ ఉంది. ఈ కారు మంచి సంఖ్యలో అమ్ముడువుతుంది.

Hyundai Venue Sales: మార్కెట్లో మంచి కారు.. హ్యుందాయ్ వెన్యూకి భారీ డిమాండ్..
Hyundai Venue Sales: ఇండియా మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూకి భారీ డిమాండ్ ఉంది. ఈ కారు మంచి సంఖ్యలో అమ్ముడువుతుంది. ఈ పాపులర్ ఎస్‌యూవీ పలు వేరియంట్లు, మూడు ఇంజన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అలానే ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. వెన్యూ వెర్షన్లు సరికొత్త రికార్డుని నెలకొల్పుతున్నాయి. హ్యుందాయ్ వెన్యూకి సంబంధించి ఫిబ్రవరి 2025 అమ్మకాల నివేదిక విడుదల అయ్యింది. అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
గత నెల అంటే ఫిబ్రవరి 2025లో హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎస్‌యూవీని 10,125 యూనిట్లు విక్రయించింది. 2024లో ఇదే నెలలో 8,933 యూనిట్లు అమ్ముడయ్యాయి. దానితో పోలిస్తే సంవత్సరానికి (YoY) వృద్ధి 13శాతం. ఈ జనవరిలో కూడా 11,106 వెన్యూ కార్లు అమ్ముడయ్యాయి. 2024 ద్వితీయార్థంలో కూడా ఈ ఎస్‌యూవీలు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో 10,265 యూనిట్లు, నవంబర్‌లో 9,754 యూనిట్లు, అక్టోబర్‌లో 10,901 యూనిట్లు, సెప్టెంబర్‌లో 10,259 యూనిట్లు అమ్ముడయ్యాయి. సరికొత్త 'హ్యుందాయ్ వెన్యూ' ప్రస్తుతం దేశీయంగా కనిష్టంగా రూ.7.94 లక్షలు, గరిష్ట ధర రూ.13.62 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది.
ఈ హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ ఇ, ఇ ప్లస్, ఎగ్జిక్యూటివ్, ఎస్, ఎస్, ఎస్ ప్లస్ వంటి అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త వెన్యూ టైటాన్ గ్రే, డెనిమ్ బ్లూ, టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ వంటి వివిధ రంగుల ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. వెన్యూ ఎస్‌యూవీ మూడు పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. లీటర్‌పై 17 నుండి 22.7 kmpl మైలేజీని కూడా ఇస్తుంది.
ఇందులో 5 మంది ప్రయాణించచ్చు. 350 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.