Car Driving Tips: హైవేలో ఈ 5 తప్పులు అస్సలు చేయోద్దు.. ప్రాణాలకే ప్రమాదం.. అవేంటంటే?
Highway Driving Rules: హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ట్రాఫిక్ టెన్షన్ ఉండదు. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఓవర్ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తుంటారు. అదే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు.
Highway Driving Tips: హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ట్రాఫిక్ టెన్షన్ ఉండదు. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఓవర్ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తుంటారు. అదే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల వల్ల మనకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన చాలా ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేగం: ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల మీకు, మీతో ప్రయాణించే వ్యక్తులకు ప్రమాదంగా మారవచ్చు. ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేస్తే, మీ భద్రత కోసం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినట్లేనని గుర్తుంచుకోవాలి.
మలుపులో కారును ఓవర్‌టేక్ చేయవద్దు : హైవేపై వచ్చే మలుపులో కారును ఓవర్‌టేక్ చేయడం మానుకోవాలి. ఇలా చేస్తుండగా చాలా సార్లు కారు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల, ఎప్పుడైనా మలుపు వస్తున్నప్పుడు, కారు వేగాన్ని తగ్గించి, మలుపు పూర్తయిన తర్వాత మాత్రమే ఓవర్‌టేక్ చేసుకోవచ్చు.
హై బీమ్ లైట్ల వాడకం: హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు తరచుగా హై బీమ్ లైట్లను ఉపయోగిస్తుంటారు. అలా చేయడం ప్రమాదకరం. సింగిల్ లేన్ రోడ్లలో హైబీమ్‌లైట్‌ను వాడితే ఎదురుగా వస్తున్న వాహనాలు రోడ్డును చూడడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.
హైవేలపై సరైన లేన్ తెలియకపోతే నష్టమే: హైవేపై ఇచ్చిన సరైన లేన్‌ను గుర్తించకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. హైవేకి కుడివైపున ఉన్న లైన్ ఓవర్‌టేక్ చేయడానికి ఉంది. కానీ, తరచుగా ప్రజలు ఈ లైన్‌లో నెమ్మదిగా నడపడం చూడొచ్చు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంది. అధిక వేగంతో ఓవర్‌టేక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ లైన్‌ను కూడా ఉపయోగించాలి.
బ్లైండ్ స్పాట్‌లో ఎక్కువసేపు ఉంటే నష్టమే: మనం హైవేపై ఓవర్‌టేక్ చేసే సమయంలో భారీ ప్రమాదాలకు గురవుతుంటారు. అందుకే బ్లైండ్ స్పాట్‌లను అర్థం చేసుకోవాలి. నిజానికి మనం కారు నడుపుతున్నప్పుడు, వెనుక ఉన్న కార్లన్నీ ORVMలో కనిపించవు. దీన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. అలాగే ముందు ఉన్న ఏ వాహనం బ్లైండ్ స్పాట్‌లో ఎక్కువసేపు ఆగకూడదు.