Best Scooters for women: లేడీస్ స్పెషల్.. రూ.70 వేలకే మంచి స్కూటర్లు!
Best Scooters for women: నవంబర్ నెలలో ప్రముఖ కంపెనీలు తమ కార్లు, మోటారు సైకిళ్లను విడుదల చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం డిజైన్ చేశారు.
Best Scooters for women: దేశంలో ఎటుచూసిన పండుగ వాతావరణం కనపిస్తుంది. జనాలంతా ఫుల్ జోష్ మీద ఉన్నారు. షాపింగ్ మాల్స్ అన్ని బిజీబిజీగా మారాయి. ప్రజలు కొత్త వస్తువులను తమ కుటుంబంలో భాగం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కార్లు, బైకులు కొనేందుకు షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. దీంతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. అయితే దీపావళి తర్వాత అంటే వచ్చే నవంబర్ నెలలో ప్రముఖ కంపెనీలు తమ కార్లు, మోటారు సైకిళ్లను విడుదల చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం డిజైన్ చేశారు. వచ్చే నెలలో విడుదలయ్యే కొత్త మోటారు సైకిళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
TVS Zest 110
టీవీఎస్ జెస్ట్ అమ్మాయిలకు మంచి ఎంపిక. ఈ స్కూటర్ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రూపొందించారు. అయితే అబ్బాయిలు కూడా దీని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. జెస్ట్ ధర రూ.74,476 నుండి ప్రారంభమవుతుంది. జెస్ట్ స్టైలిష్‌గా ఉంటుంది. ఇంజన్ గురించి మాట్లాడితే స్కూటర్‌లో 110c ఇంజన్ ఉంది. ఇది 5.7kw పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ ఉంది.
TVS New Jupiter 110
టీవీఎస్ కొత్త జూపిటర్ 110 మంచి స్కూటర్. ఇది కొత్త అవతార్‌లో కూడా వచ్చింది. ఇది అనేక ఫీచర్లతో కూడిన డిజిటల్ స్పీడోమీటర్‌ను కలిగి ఉంది. స్కూటర్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఇంజిన్ గురించి మాట్లాడితే ఈసారి కొత్త జూపిటర్‌లో కొత్త 113cc సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్ 5.9kW పవర్, 9.8 వరకు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కిమీ. ఇందులో మీకు చాలా మంచి స్పేస్ కూడా లభిస్తుంది. 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉన్న సెగ్మెంట్‌లో ఇది మొదటి స్కూటర్. కొత్త జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,700 నుంచి ప్రారంభమవుతుంది.
Honda Activa 110
ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు హోండా యాక్టివా. ఇంజన్ గురించి మాట్లాడితే యాక్టివాలో 110cc PGM-FI, 5.77 KW పవర్, 8.90Nm టార్క్‌ని అందించే 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇందులో ఆటోమేటిక్ (V-మ్యాటిక్) గేర్‌బాక్స్ ఉంది. యాక్టివా అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని ఇంజన్. ఈ స్కూటర్ ఒక లీటరులో 50-55 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 12 అంగుళాల చక్రాలు ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ.76,234 నుంచి ప్రారంభమవుతుంది.
Hero Pleasure Plus Xtec
హీరో మోటోకార్ప్ ప్లెజర్ ప్లస్ Xtec ఒక మంచి స్కూటర్. ఇంజన్ గురించి మాట్లాడితే ఈ స్కూటర్‌లో 110cc ఇంజన్ ఉంది. ఇది 8 bhp పవర్, 8.7Nm టార్క్ అందిస్తుంది. రోజువారీ ఉపయోగం కోసం ఇది మంచి స్కూటర్. దాని సీట్ల మధ్య చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఇది అన్ని రకాల వాతావరణంలో బాగా పనిచేస్తుంది. ఇందులో కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.