Top 5 Street Bikes: అద్భుతమైన టాప్-5 బైకులు ఇవే
Top 5 Street Bikes: సరసమైన బైక్‌ల నుండి లక్షల ఖరీదు చేసే మోటార్‌సైకిళ్ల వరకు మార్కెట్లో ఎన్నో రకాల బైక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఈరోజు డ్యూయల్ ఛానెల్ ABS కలిగిన టాప్-5 నేకెడ్ బైక్‌ల వంతు వచ్చింది. వీటి ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువ.
Top 5 Street Bikes: సరసమైన బైక్‌ల నుండి లక్షల ఖరీదు చేసే మోటార్‌సైకిళ్ల వరకు మార్కెట్లో ఎన్నో రకాల బైక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఈరోజు డ్యూయల్ ఛానెల్ ABS కలిగిన టాప్-5 నేకెడ్ బైక్‌ల వంతు వచ్చింది. వీటి ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువ.
యమహా MT 15 V2
యమహా MT 15 V2... భారతీయ మార్కెట్లో డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్న అత్యంత చౌకైన నేకెడ్ బైక్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 1.68 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు ఈ బైకును కొనుగోలు చేయొచ్చు. బ్రేకింగ్ కోసం, ఇది డ్యూయల్-ఛానల్ ABS తో ముందు భాగంలో 282 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 220 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. MT 15 V2 155 cc, సింగిల్ సిలిండర్ ఇంజన్ 18.14 bhp పవర్, 14.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
బజాజ్ పల్సర్ NS400Z
ఈ జాబితాలో రెండవ స్థానంలో ప్రముఖ పల్సర్ సిరీస్ బైక్ NS400Z ఉంది. 1.85 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద దీనిని కొనుగోలు చేయచ్చు. బ్రేకింగ్ కోసం. ఇది డ్యూయల్ ఛానల్ ABSతో 320 mm ఫ్రంట్ డిస్క్, 230 mm వెనుక డిస్క్‌ను పొందుతుంది. NS400Z 373cc ఇంజన్ 39 bhp పవర్, 35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ యూనిట్ డొమినార్ నుండి తీసుకొన్నారు.
హోండా CB300R
డ్యూయల్ ఛానల్ ABSతో వచ్చే టాప్-5 నేకెడ్ బైక్‌ల జాబితాలో CB300R మూడవ స్థానంలో ఉంది. మీరు దీన్ని రూ. 2.40 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ బ్రేక్ సిస్టం విషయానికొస్తే... ఇది రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. డ్యూయల్-ఛానల్ ABS కలిగి ఉంటుంది. ఇందులోని 286CC, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 30 Bhp పవర్, 27.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
కేటీఎం 250 Duke
KTM 250 డ్యూక్ బైక్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. కస్టమర్లు దీనిని రూ. 2.41 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. బ్రేకింగ్ కోసం ఇది 320 mm ఫ్రంట్ డిస్క్, డ్యూయల్-ఛానల్ ABSతో 240 mm వెనుక డిస్క్‌తో వస్తుంది. ఇందులో కార్నరింగ్ ABS, సూపర్‌మోటో ABS ఉన్నాయి. ఇందులోని 248 CC, సింగిల్ సిలిండర్ ఇంజన్ 30 Bhp పవర్, 25 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ అపాచి RTR 310
చివరిది TVS Apache RTR 310. మీరు దీన్ని రూ. 2.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయచ్చు. ఇది 17-అంగుళాల డ్యూయల్ కాంపౌండ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ABS తో సింగిల్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. ఇందులోని 312CC ఇంజన్ 35 Bhp పవర్, 28.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.