Best Scooter: బెస్ట్ స్కూటర్లు.. కొంటే ఈ ఐదే కొనండి!
Top 5 best 110cc scooters in India: ఈ నేపథ్యంలో 110 cc కేటగిరీలో ప్రసిద్ధి చెందిన హోండా యాక్టివా 6G, టీవీఎస్ జెస్ట్, హీరో ప్లెజర్ ప్లస్, హోండా డియో, హీరో జూమ్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Best Scooter: ప్రతి ఒక్కరికీ రోజువారీ వినియోగానికి ద్విచక్ర వాహనాలు అవసరం. అయితే బైక్‌లు, స్కూటర్లలో ఏదైనా కొనడం మంచిదనే అయోమయం చాలా మందిలో ఉంది. మోటార్ సైకిళ్లతో పోలిస్తే, స్కూటర్లు 'గేర్‌లెస్' స్త్రీలు, పురుషులకు సరిపోతాయి. ఈ నేపథ్యంలో 110 cc కేటగిరీలో ప్రసిద్ధి చెందిన హోండా యాక్టివా 6G, టీవీఎస్ జెస్ట్, హీరో ప్లెజర్ ప్లస్, హోండా డియో, హీరో జూమ్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ముందుగా హోండా యాక్టివా 6జీ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది రూ.79,624 నుండి రూ.84,624 ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇది 7.79 PS హార్స్ పవర్, 8.84 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 109.51 cc పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది.
ఈ హోండా యాక్టివా స్కూటర్ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 59.5 kmpl మైలేజీని ఇస్తుంది. మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ అండ్ పెర్ల్ ప్రెషియస్ వైట్‌తో సహా వివిధ రంగులలో అందుబాటులో ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కీ-లెస్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్‌లు ఉన్నాయి. భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ గురించి మాట్లాడితే ఈ స్కూటర్ ధర రూ.72,614 నుండి రూ.73,417 మధ్య ఉంటుంది. ఇందులో 109.7 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 7500 rpm వద్ద 7.8 PS హార్స్ పవర్, 8.84 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 48 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
కొత్త TVS స్కూటీ జెస్ట్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్, మ్యాట్ రెడ్ వంటి వివిధ రంగుల ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. ఇది 103 కిలోల బరువు, 5-లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది రైడర్ ప్రొటక్షన్ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.
హీరో ప్లెజర్ ప్లస్ గురించి చెప్పాలంటే దీని ధర రూ. 72,163 నుండి రూ. 83,918 ఎక్స్-షోరూమ్. ఇందులో 110.9 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 50 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఇది LCD స్క్రీన్‌తో సహా పలు ఫీచర్లను కలిగి ఉంది.
హోండా డియో కూడా ఒక ముఖ్యమైన స్కూటర్. దీని ధర రూ.75,630 నుంచి రూ.82,580. ఇది 8000 rpm వద్ద 7.85 PS హార్స్ పవర్, 5250 rpm వద్ద 9.03 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేసే 109.51 cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 50 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.
హీరో జూమ్ విషయానికొస్తే ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,761 నుండి రూ. 85,400 మధ్య ఉంటుంది. ఇందులో 110.9 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 7250 rpm వద్ద 8.15 PS హార్స్ పవర్, 5750 rpm వద్ద 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.