MG Windsor: సింగిల్ ఛార్జ్‌తో 332 కిమీ రేంజ్.. ఎమ్‌జీ విండ్సర్ ఎస్‌యూవీ!
MG Windsor: చైనా ఆటో మేకర్ ఎమ్‌జీ మోటర్ తన కార్లను విక్రయించడానికి జెఎస్‌డబ్లూతో ఒప్పందం కుదుర్చుకుంది.
MG Windsor: చైనా ఆటో మేకర్ ఎమ్‌జీ మోటర్ తన కార్లను విక్రయించడానికి జెఎస్‌డబ్లూతో ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఎమ్‌జీ విండ్సర్ 101 కార్లను వెలివరీ చేసింది. ఈ కొత్త క్రాస్ఓవర్ యుటిలిటీ వాహనాన్ని బెంగళూరులోని ఎమ్‌జీ జూబిలెంట్ పంపిణీ చేసింది. విండ్సర్ ఇటీవల బుకింగ్ ప్రకటించిన 24 గంటల్లోనే 15,176 బుకింగ్‌లను సాధించింది. ఇది దేశంలో మొదటి ప్యాసెంజర్ ఈవీ అయింది. ఇది వాహన కొనుగోలుదారులలో ఇంటెలిజెంట్ CUVకి పెరుగుతున్న డిమాండ్‌ను చూపుతోంది.
ఎమ్‌జీ విండ్సర్ ఒక సెడాన్ సౌలభ్యం కోసం ఎస్‌యూవీ సస్పీసియన్స్, కొత్త ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన, విలాసవంతమైన ఇంటీరియర్, భద్రత, స్మార్ట్ కనెక్టివిటీ, డ్రైవింగ్ వంటి అనేక హై-టెక్ ఫీచర్లతో వస్తుంది. అలాగే ఈ కారు ప్రముఖ 'ప్యూర్ EV ప్లాట్‌ఫామ్'పై తయారైంది.
MG విండ్సర్ కారు ఒక విలాసవంతమైన బిజినెస్ క్లాస్ అనుభవాన్ని అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిమీ రేంజ్ ఇస్తుంది. కంపెనీ రూ. 13,49,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద కారును అందిస్తోంది. ఎమ్‌జీ విండ్సర్ డ్రైవర్, ప్రయాణీకులకు సౌలభ్యం, సాంకేతికత రెండింటినీ పెంపొందించేలా ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో వచ్చింది.
దీని ఫస్ట్-క్లాస్ ఏరో లాంజ్ సీట్లు వాటి 135 డిగ్రీ రిక్లైన్ సామర్ధ్యాన్ని అందిస్తాయి. అయితే విశాలమైన 604 లీటర్ బూట్ స్పేస్ సామాను కోసం పుష్కలంగా ఉంది. విండ్సర్ IP67-సర్టిఫైడ్ 38kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మన్నిక, భద్రతను నిర్ధారిస్తుంది అని కంపెనీ తెలిపింది.
విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ కారులో ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా దాని ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, 2700 మిమీ అద్భుతమైన వీల్‌బేస్ ఓపెన్‌నెస్, లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది.
ఎమ్‌జీ విండ్సర్ దాని MG-Jio ఇన్నోవేటివ్ కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్ (ICP)తో స్మార్ట్ కనెక్టివిటీ, ఇన్-కార్ టెక్నాలజీని కొత్త ఎత్తుకు తీసుకువెళ్లింది. ఇది హోమ్-టు-కార్ యాక్టివిటీ, 100కి పైగా AI పవర్డ్ వాయిస్ కమాండ్‌ల వంటి అధునాతన ఫీచర్‌లను అందిస్తోంది.