Joy Water-Powered Scooter: వాటర్‌తో నడిచే స్కూటర్.. లీటర్‌పై 150 కిమీ పరుగులు..!
Joy Water-Powered Scooter: ఆటో రంగంలో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తర్వాత, ఇప్పుడు నీటితో నడిచే స్కూటర్ల వంతు వచ్చింది.
Joy Water-Powered Scooter: ఆటో రంగంలో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తర్వాత, ఇప్పుడు నీటితో నడిచే స్కూటర్ల వంతు వచ్చింది. ఈ సంవత్సరం, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో జాయ్ ఈ-బైక్ దాని నీటితో నడిచే స్కూటర్‌ను ప్రదర్శించింది. ఇది చాలా చర్చనీయాంశమైంది. ఈ స్కూటర్ ఉత్పత్తికి సంబంధించి జాయ్ ఇ-బైక్ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మీడియా నివేదికల ప్రకారం ఈ స్కూటర్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మరోసారి పరిచయం చేయవచ్చు.
నివేదికల ప్రకారం జాయ్ ఈ బైక్ మాతృ సంస్థ వార్డ్‌విజార్డ్ నిరంతరం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఈ టెక్నాలజీ కింద ఈ స్కూటర్ నీటిపై నడుస్తుంది. భారతదేశంలో హైడ్రోజన్ సాంకేతికత విజయవంతమైతే, క్లీన్ మొబిలిటీలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అంటే దీని రాక కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్‌తో నడుస్తుంది. స్కూటర్ సాంకేతికత నీటి అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. దాని నుండి హైడ్రోజన్ అణువులను వేరు చేస్తుంది. హైడ్రోజన్ వేరు చేసినప్పుడు స్కూటర్‌ను నడపడానికి హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగిస్తారు.
కానీ ఇది ప్రారంభం మాత్రమే కాబట్టి అధిక పనితీరు గల వాహనాన్ని ఆశించవద్దు. ఈ నీటితో నడిచే స్కూటర్ టాప్ స్పీడ్ 25kmph వరకు ఉంటుంది. దీనిని మరింత పెంచవచ్చు. ఇప్పుడు తక్కువ వేగం కారణంగా, దీన్ని నడపడానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్‌లో పెడల్స్ కూడా అందించారు. కొన్ని కారణాల వల్ల దాని పరిధి అయిపోయినట్లయితే దానిని పెడల్స్ సహాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు.
భారతదేశంలో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలపై పనిచేస్తున్న అనేక ఆటో కంపెనీలు ఉన్నాయి. జాయ్ ఈ బైక్ ఈ హైడ్రోడాన్ స్కూటర్ ఖచ్చితమైన వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ స్కూటర్ ఒక లీటరు నీటిలో 150 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అయితే ఇది ఇప్పటికీ ప్రోటోటైప్, అంటే ఈ స్కూటర్ ఇంకా అమ్మకానికి అందుబాటులో లేదు.
ప్రస్తుతం కంపెనీ తన సాంకేతికతను మరింత మెరుగుపరిచే పనిలో ఉంది. ఫైనల్ మోడల్ వచ్చే వరకు ఎక్కువ మాట్లాడటం సరికాదు. మూలం ప్రకారం తుది మోడల్ రూపకల్పన నుండి దాని లక్షణాలు, పరిధి వరకు ప్రధాన మార్పులు చూడవచ్చు.