Car Battery: కారు బ్యాటరీ ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయవద్దు..!

Car Battery: చాలామంది కష్టపడి కలల కారు కొంటారు కానీ మెయింటనెన్స్‌ సరిగ్గా చేయరు. దీంతో కారు తరచుగా గ్యారేజ్‌కు వెళుతూ ఉంటుంది.

Update: 2024-01-06 14:30 GMT

Car Battery: కారు బ్యాటరీ ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయవద్దు..!

Car Battery: చాలామంది కష్టపడి కలల కారు కొంటారు కానీ మెయింటనెన్స్‌ సరిగ్గా చేయరు. దీంతో కారు తరచుగా గ్యారేజ్‌కు వెళుతూ ఉంటుంది. కొన్నదాని కంటే రిపేర్‌కే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కారు బ్యాటరీ గురించి. చాలామంది బ్యాటరీని పట్టించుకోకపోవడం వల్ల అది తొందరగా డ్యామేజ్ అవుతుంది. దీంతో బ్యాటరీ తరచుగా మార్చాల్సి ఉంటుంది. కారు బ్యాటరీ తొందరగా చెడిపోవడానికి గల కారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవడం

బ్యాటరీని పూర్తిగా వాడడం మంచిది కాదు. బ్యాటరీకి జరిగే అత్యంత హానికరమైన విషయాలలో ఇది ఒకటి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లోపల ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్యాటరీ ప్లేట్లను దెబ్బతీస్తుంది.

బ్యాటరీని అధికంగా ఛార్జ్ చేయడం

అధికంగా ఛార్జ్ చేయడం బ్యాటరీకి హానికరం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లోపల ఉండే నీరు ఆవిరిగా మారి బ్యాటరీని దెబ్బతీస్తుంది.

బ్యాటరీని అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం

బ్యాటరీని ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం హానికరం. అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్యాటరీ లోపల నీరు ఆవిరిగా మారి బ్యాటరీ దెబ్బతింటుంది. తక్కువ ఉష్ణోగ్రతలు బ్యాటరీ వాహకతను తగ్గిస్తాయి. బ్యాటరీని ప్రారంభించడం కష్టతరం చేస్తాయి.

బ్యాటరీలోకి తేమ చేరడం

బ్యాటరీలోకి తేమ చేరడం కూడా బ్యాటరీకి హానికరం. తేమ బ్యాటరీ లోపల ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను తుప్పు పట్టి బ్యాటరీని దెబ్బతీస్తుంది.

బ్యాటరీ వైర్, కనెక్టర్‌ లోపం

బ్యాటరీ వైర్, కనెక్టర్‌లో లోపం కారణంగా బ్యాటరీ నుంచి విద్యుత్ సరిగా ప్రవహించదు. దీని వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది బ్యాటరీ త్వరగా పాడైపోతుంది.

కారు బ్యాటరీని ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలంటే ఇవి పాటించాలి

1. బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడాన్ని నివారించాలి.

2. బ్యాటరీని ఓవర్‌ఛార్జ్ చేయవద్దు.

3. ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీని ఉంచవద్దు

4. బ్యాటరీలోకి తేమ ప్రవేశించడానికి అనుమతించవద్దు.

5. బ్యాటరీ కేబుల్స్, కనెక్టర్లను క్రమం తప్పకుండా చెక్‌ చేయాలి.

Tags:    

Similar News