Most Affordable Bike: ధర రూ.45 వేలు.. మైలేజ్ 80Kmpl.. ఎంత లగేజీనైనా ఈజీగా తీసుకెళ్లొచ్చండోయ్.. ఈ కూల్ 'బైక్' ఫీచర్లు అదిరిపోయాయంతే..!

TVS XL100: భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ కూడా భారత్‌దే. దేశంలో ప్రతి నెలా లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి.

Update: 2023-09-22 02:00 GMT

Most Affordable Bike: ధర రూ.45 వేలు.. మైలేజ్ 80Kmpl.. ఎంత లగేజీనైనా ఈజీగా తీసుకెళ్లొచ్చండోయ్.. ఈ కూల్ 'బైక్' ఫీచర్లు అదిరిపోయాయంతే..!

Most Affordable Bike-TVS XL100: భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ కూడా భారత్‌దే. దేశంలో ప్రతి నెలా లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. దేశ జనాభాలో ఎక్కువ మంది వ్యక్తిగత రవాణా కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. అది స్కూటర్ లేదా మోటార్ సైకిల్ కావచ్చు. కానీ, భారత మార్కెట్‌ను ధరల సెన్సిటివ్ మార్కెట్‌గా చూస్తారు. అంటే, ఇక్కడ ఉత్పత్తి ధర వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ద్విచక్ర వాహనాలకు కూడా ఇదే వర్తిస్తుంది.

భారతదేశంలో, వాహనాల ధర, వాటి నిర్వహణ ఖర్చు రెండూ చాలా ముఖ్యమైన అంశాలు. ఇటువంటి పరిస్థితిలో, ఈ రోజు మేం మీకు ద్విచక్ర వాహనం గురించి సమాచారాన్ని అందించబోతున్నాం. దీని ధర కేవలం రూ. 45,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 80 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. మేం TVS XL100 గురించి మాట్లాడుతున్నాం. ఇది మోపెడ్. ఇది వస్తువులను ఈజీగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లగలదు.

ఇంజిన్, మైలేజ్..

TVS XL100లో 99.7 cc పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 4.4bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ దాదాపు 6.5 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. TVS XL100 చాలా తేలికగా ఉంటుంది. దీని కర్బ్ వెయిట్ 89 కిలోలు. ఇది లీటరుకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇవ్వగలదు.

ధర..

ఇందులో కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉన్నాయి. అయితే, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ఖరీదైనది. ఇది మొత్తం 6 వేరియంట్లలో వస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 44,999 కాగా టాప్ వేరియంట్ ధర రూ. 59,695 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

లక్షణాలు..

ఇది సాధారణ లక్షణాలను కలిగి ఉంది. ఇది డ్రమ్ బ్రేక్, అనలాగ్ స్టైల్ స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, DRLతో వస్తుంది. దీనికి ముందు భాగంలో క్యారియర్ కూడా ఉంది. దానిపై మీరు లగేజీని కూడా ఈజీగా తీసుకపోవచ్చు.

Tags:    

Similar News