Weekly Horoscope: ఈ రాశివారి జీవిత భాగస్వామి సూచనలతో అంతా శుభమే..12 రాశుల వారి వార ఫలాలు

Weekly Horoscope: ఈ రాశివారి జీవిత భాగస్వామి సూచనలతో అంతా శుభమే..12 రాశుల వారి వార ఫలాలు

Update: 2024-10-06 00:30 GMT

Weekly Horoscope: ఈ రాశివారి జీవిత భాగస్వామి సూచనలతో అంతా శుభమే..12 రాశుల వారి వార ఫలాలు

(06-10-2024 నుంచి 12-10-2024 వరకు)

మేషం


 అన్ని ప్రయత్నాలూ అనుకూలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. బ్యాంకు లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. వృత్తిపరమైన ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మేలిమి అవకాశాలు దక్కుతాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం గోచరిస్తోంది. సంతానం తీరు కాస్త చికాకు పెడుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల భారీగా నష్టపోతారు. చెప్పుడు మాటలు వినకండి. కోర్టు వివాదాలను పరిష్కరించుకోండి.

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం


 నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. బంధాలు బలపడతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామి సూచనలతో కుటుంబ చిక్కులను పరిష్కరిస్తారు. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. ఇరుగుపొరుగుతో సఖ్యత పెరుగుతుంది. విజ్ఞానాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు అనువైన సమయం. బంధువులను కలుస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా పైఅధికారుల కోపానికి గురవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తు గురించిన ప్లాన్స్ వేస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త,

పరిహారం : శ్రీ వేంకటేశ్వరుని పూజించండి. పసుపు, తెలుపు రంగులు కలిసిన వస్త్రాలను వేసుకోండి.

మిథునం


 ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. శుభ ఫలితాలు అందుతాయి. ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. కొత్త వస్తువులను కొంటారు. కోర్టు సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మనో ధైర్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సూచనలతో బలహీనతలను అధిగమిస్తారు. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుత్వాలు బలపడతాయి. మనశ్శాంతిని పొందుతారు. ఓదశలో ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచండి.

పరిహారం : దుర్గాదేవిని పూజించండి. ముఖ్యమైన పనులకు ఎర్రటి రంగు కలిసిన వస్త్రాలను వేసుకెళ్లండి.

కర్కాటకం


 పనులన్నీ శుభప్రదంగా సాగుతాయి. వ్యవహారాలన్నింటా సత్ఫలితాలను పొందుతారు. ధనసంబంధ చిక్కులు తొలగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. బంధుమిత్రులూ సహకరిస్తారు. ప్రయాణాలు లాభదాయంగా ఉంటాయి. ఉద్యోగులు, పైఅధికారుల ప్రశంసలను పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. వాత సమస్యలుంటాయి. తగాదాలు వద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త.

పరిహారం : సూర్యుణ్ణి ప్రార్థించండి. పనులకు వెళ్లేటప్పుడు లేత నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం


 బలహీనతలను జయిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగానే ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పనుల్లో అడ్డంకులను అధిగమిస్తారు. ఆస్తి లావాదేవీలు బెడిసికొట్టే వీలుంది. మీకు తోడుగా ఉన్నవారి వల్లే ఇబ్బంది పడతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. విద్యారంగంలోని వారు ఉన్నతాధికారుల దండనకు గురవుతారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినివ్వవు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. వృథాఖర్చులను తగ్గించాలి. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. మిత్రులతో విభేదాలొస్తాయి.

పరిహారం : పార్వతీ దేవిని పూజించండి. ముదురు పసుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కన్య


వృత్తిపరమైన పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. నాయకత్వ పటిమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. సహచరుల సహకారం లభిస్తుంది. కీలక సమయంలో అదృష్టం కూడా తోడుంటుంది. ప్రియతములను కలుస్తారు. మిత్రులు తోడుంటారు. సోదరుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం అనుకూలిస్తుంది. ఎదురు చూస్తున్న వర్తమానం అందుతుంది. వాహన సంబంధ చికాకులు గోచరిస్తున్నాయి. సేవా వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం : శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. ముదురు ఎరుపు వర్ణం కలిసిన దుస్తులు ధరించండి.

తుల


 స్థిర చిత్తంతో కార్యాలను సాధిస్తారు. ఈక్రమంలో అడ్డంకులనూ దాటేస్తారు. ముఖ్యమైన పనిలో సోదరులు తోడుగా నిలుస్తారు. బోళాతనం వల్ల నష్టపోయే వీలుంది. మీడియా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు పెరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు సంతృప్తినివ్వవు. చెప్పుడు మాటలు నమ్మకండి. హామీలు నెరవేర్చని కారణంగా నింద పడాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం : నవగ్రహాలకు ప్రదక్షిణలు, పూజలు ఉపకరిస్తాయి. వంకాయ రంగు కలిసిన దుస్తులు ధరించండి.

వృశ్చికం


యోగదాయకంగా ఉంటుంది. ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. దీర్ఘకాలంగా పెండింగులోని సమస్యలూ పరిష్కారం అవుతాయి. అవసరమైన వేళ అదృష్టమూ తోడుగా నిలుస్తుంది. దాయాదులతో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్య సమాచారం ఆనందాన్నిస్తుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. వృథా ఖర్చులు తగ్గించాలి. కుటుంబం వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి.

పరిహారం : దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెలుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

ధనుస్సు


 పనుల పూర్తికి శ్రమించాల్సి వుంటుంది. ఉన్నత లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. ఈ దిశగా ప్రయత్నం ఫలిస్తుంది. అత్యవసర వేళ అదృష్టం వరిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. మీ వ్యక్తిత్వంతో ప్రముఖులను ఆకట్టుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. మాట తప్పడం వల్ల నింద భరించాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

పరిహారం : దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గోధుమ వర్ణం కలిసిన వస్త్రాలను ధరించడం మంచిది.

మకరం


 అన్నిరకాలుగానూ శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు క్రమశిక్షణను నేర్పుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో సోదరులు సహకరిస్తారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. గౌరవం పొందుతారు. రెండో పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి. హామీ సంతకాలు చేయకండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. మనశ్శాంతి కరువవుతుంది.

పరిహారం : గాయత్రీమాతను పూజించండి. పసుపు, ఎరుపు వర్ణాలు కలిసిన వస్త్రాలను ధరించండి.

కుంభం 


పట్టింది బంగారంలా ఉంటుంది. అన్ని పనులూ ఆశించిన రీతిలో సఫలం అవుతాయి. ఉద్యోగస్తులు పైఅధికారుల ప్రశంసలను పొందుతారు. రివార్డులూ లభిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. రుణ విముక్తి ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. గృహనిర్మాణానికి సంబంధించిన ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. పెద్దవారి ఆశీస్సులను పొందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బద్ధకం వీడండి. వేళకు భోజనం ఉండదు.

పరిహారం : శనైశ్చరుడిని పూజించండి. నీలం లేదా నల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మీనం


 ఆకాంక్ష నెరవేరుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ అవసరాలను తీరుస్తారు. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. కొత్త స్నేహాల వల్ల లబ్ది చేకూరుతుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మేలిమి అవకాశాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తారు.

పరిహారం : ఆంజనేయ స్వామిని పూజించండి. లేత సింధూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

Tags:    

Similar News