Balineni Srinivas Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ..

వైఎస్ఆర్ సీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు

Update: 2024-09-18 11:14 GMT

Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాజకీయాల్లో భాష, గౌరవంగా, హుందాతనంగా ఉండాలని ఆయన చెప్పారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదేని ఆయన చెప్పారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని ఆయన ఆ లేఖలో చెప్పారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని ఆయన తెలిపారు. కొన్పి కారణాలతో ఇప్పుడు పార్టీని వీడుతున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

బాలినేని జనసేనలో చేరుతారని కొంతకాలంగాప్రచారం సాగుతోంది . ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన సెప్టెంబర్ 19న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు.

జగన్ తో భేటీ అయిన వారం రోజులకే రాజీనామా

ఈ నెల 11న వైఎస్ జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను తీసుకోవాలని జగన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కోరారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. పార్టీని నమ్ముకుని పనిచేసిన తనకు జరిగిన అన్యాయాలను ఆయన ఏకరువు పెట్టారు. పార్టీని వీడుతున్నానని వారం రోజుల క్రితమే ఆయన తన నిర్ణయాన్ని జగన్ కు చెప్పారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జగన్ తో భేటీ ముగిసిన వారం రోజుల తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

రేపు విజయవాడలో పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబర్ 19న పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. హైద్రాబాద్ నుంచి ఆయన నేరుగా విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ తో సమావేశంలో రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన జనసేన, టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, ఆయన వైఎస్ఆర్ సీపీలోనే ఉన్నారు.

వైఎస్ఆర్ సీపీకి చెందిన కొందరు కీలక నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు. తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Tags:    

Similar News