YSR jayanthi 2020: ఘనంగా వైఎస్సార్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు

YSR jayanthi 2020: మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-07-08 02:00 GMT
YSR Jayanthi

YSR jayanthi 2020: మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజున రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది.

నేడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సంద‌ర్భంగా.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అందులో ప్ర‌ధానంగా త‌న తండ్రికి నివాళులు అర్పించ‌డానికి సీఎం జ‌గ‌న్.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిన్న సాయంత్ర‌మే ఇడుపుల‌పాయ‌కు వెళ్లారు. ఇవాళ ఉద‌య‌మే 8.10 గంట‌ల‌కు త‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి వైఎస్సార్ ఘాట్ ద‌గ్గ‌ర నివాళులు అర్పిస్తారు. ఆ త‌ర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జ‌రిగే ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు.

కార్యక్రమాలివే..

– ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంప‌స్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌

– ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీలో రూ.10.10 కోట్ల‌తో ఏర్పాటు చేసిన కంప్యూట‌ర్ సెంట‌ర్ కు శంకుస్థాప‌న‌

– అలాగే వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ రాసిన నాలో నాతో పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

– పేద విద్యార్థుల‌కు టెక్నాల‌జీ విద్య‌ను అందించేందుకు ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల‌తో నిర్మించిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ త‌ర‌గ‌తి భ‌వ‌నాల ప్రారంభం

– ఇడుపులపాయ నెమ‌ళ్ల పార్టు ప‌క్క‌న మూడు మెగావాట్ల సామ‌ర్ధ్యంతో రెస్కో కోల‌బ్రేష‌న్ సిస్ట‌మ్ తో సోలార్ విద్యుత్ ప్లాంట్ కి సంబంధించిన శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ‌

– ఇక వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా గుంటూరు తాడేప‌ల్లిలోని వైసీపీ ఆఫీసులో ఉద‌యం 9.15 గంట‌ల‌కు నివాళులు అర్పిస్తారు. 

Tags:    

Similar News