YSR Asara Scheme: ఏపీలో వైఎస్‌ఆర్ ఆసరా రెండవ విడత
YSR Asara Scheme: *రెండో విడతగా రూ.6,439 కోట్లు పంపిణీ *ఒంగోలులో లాంఛనంగా సీఎం జగన్ ప్రారంభం
YSR Asara Scheme: వైఎస్‌ఆర్ ఆసరా రెండవ విడతను ఇవాళ ఏపీ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 78.76లక్షల మంది మహిళలకు 6వేల 439 కోట్ల రూపాయలను పంపిణీ చేయనున్నారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల లబ్ధిదారుల చొప్పున పది రోజుల పాటు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
ఉదయం 9గంటల 55నిమిషాలకు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలుకు బయల్దేరుతారు. 11 గంటలకు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ వివిధ స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.