YS Sharmila: ఎంఓయూ చేసినప్పుడు బెయిల్ రద్దు అవుతుందని జగన్ కు తెలియదా?: వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ శతాబ్దపు జోక్ గా చెప్పారు.

Update: 2024-10-30 11:01 GMT

ఎంఓయూ చేసినప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా?:జగన్ ను ప్రశ్నించిన వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ శతాబ్దపు జోక్ గా చెప్పారు. తనకు వంద శాతం వాటాలు బదిలీ చేస్తామని ఎంఓయూపై జగన్ సంతకం చేశారు. ఆ సమయంలో బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు.సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆమె చెప్పారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు... 32 కోట్ల విలువజేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనన్నారు.

గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటికి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదన్నారు. బుధవారం వైఎస్ షర్మిల మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2012 లో క్లాసికల్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు? షేర్లు అమ్మినప్పుడు బెయిల్ రద్దు చేస్తారని తెలియదా? అని అడిగారు. షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని జగన్ కు తెలుసునని ఆమె చెప్పారు. 

Tags:    

Similar News