YS Sharmila: అందరి ఇళ్లలో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేస్తారా?: జగన్ కు వైఎస్ షర్మిల కౌంటర్
YS Sharmila: కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమే.. కానీ, అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల్ల మీద కేసులు వేస్తారా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.
YS Sharmila: కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమే.. కానీ, అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెళ్ల మీద కేసులు వేస్తారా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరులు మాజీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. గురువారం ఆమె ఓ తెలుగు న్యూస్ చానల్ తో విజయవాడలో మాట్లాడారు.
జగన్ ఏమన్నారంటే?
పాలన వదిలేసి తన తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తీరును మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుబట్టారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండేవని చెప్పారు. మీ ఇళ్లలో కుటుంబ సమస్యలు లేవా అని ఆయన అడిగారు. మీ స్వార్ధం కోసం వీటిని పెద్దవి చేసి చూపడం, నిజాలు లేకపోయినా వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అసలు ఏం జరిగింది?
సరస్వతి పవర్ కంపెనీలో తనకు, తన భార్య భారతిరెడ్డికి ఉన్న వాటాలను సరస్వితిలోనే తమకు చెందిన క్లాసిక్ రియాల్టీ అనే మరో కంపెనీకి ఉన్న వాటాల్లో అధిక భాగాన్ని తల్లి విజయమ్మ పేరుతో సర్వసతి కంపెనీ బోర్డు అక్రమంగా బదలాయించిందని భారతి,క్లాసిక్ రియాల్టీలతో కలిపి జగన్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్ సీ ఎల్ టీ లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ కేసుకు సంబంధించిన వివాదాలు పరిష్కారమయ్యాక కొన్ని ఆస్తులను షర్మిలకు బదలాయించాలని గతంలో నిర్ణయించినట్టు జగన్ ఆ పిటిషన్ లో చెప్పారు. ఈ పిటిషన్ దాఖలుకు కొన్ని రోజుల ముందే వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కు లేఖ రాశారని సమాచారం. తనను అప్రతిష్టపాల్జేసేలా వ్యవహరించారని షర్మిలపై జగన్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను షర్మిల తోసిపుచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటను జగన్ తప్పారని కూడా ఆ లేఖలో ఆమె చెప్పారు.