రేపు వైఎస్సార్ -జగనన్న ఇళ్ల ప్రారంభోత్సవం
YS Jagan: పేదవారి సొంతింటి కల సాకారం పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది
YS Jagan: పేదవారి సొంతింటి కల సాకారం పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి భారీగా గృహనిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. రేపు వైయస్‌ఆర్ జగనన్న కాలనీల గృహనిర్మాణం ప్రారంభంకానున్నాయి. క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చ్యువల్‌గా పనులను ప్రారంభించనున్నారు సీఎం వైయస్ జగన్.
రూ.28,084 కోట్లతో మొదటిదశలో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం కేటాయించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు సాగనున్నారు. రెండో దశలో రూ.22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం చేయనున్నారు. 2023 నాటికి 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు' హామీ పూర్తి దిశగా జగన్ సర్కార్ చొరవచూపనుంది.