CM Jagan: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు కారణం ఇదే.. ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ..

CM Jagan: ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకంటే ఎక్కువ గౌరవం ఉంది.

Update: 2022-09-21 07:59 GMT

CM Jagan: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు కారణం ఇదే.. ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ..

CM Jagan: ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకంటే ఎక్కువ గౌరవం ఉంది. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు. నందమూరి తారక రామారావు అని మనం పలికితే చంద్రబాబుకి నచ్చదు. చంద్రబాబు ఎన్టీఆర్ అని పలికితే ఎన్టీఆర్ కి నచ్చదు. ఎన్టీఆర్ అంటే గొప్పనటుడు, గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి అని దేశంలో అందరికీ తెలుసు. ఆయన బతికి వుండి వుంటే పూర్తిస్థాయి సీఎంగా పనిచేసి వుండేవారు అని సీఎం జగన్ అన్నారు. 1995లో సొంత కూతురిని ఇచ్చిన అల్లుడు అధికారం లాక్కోవడంతో మానసిక క్షోభ వల్ల ఎన్టీఆర్ అకాల మరణం చెందారన్నారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టి మాట నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్‌. వైద్య రంగంలో సంస్కరణలకర్త. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి అని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనది. ఏపీ 11 మెడికల్‌ కాలేజీలకు ఎనిమిది, టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టలేదు.

మూడు మెడికల్‌ కాలేజీలు వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయి. ప్రస్తుతం మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా.. ఏపీలో ఉన్న(నిర్మాణ దశలో ఉన్నవి కలుపుకుని) 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్‌, ఆయన కొడుకు(వైఎస్‌ జగన్‌) హయాంలోనే వచ్చాయి. అలాంటప్పుడు వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా?, అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని సీఎం జగన్‌, టీడీపీని నిలదీశారు.

Full View


Tags:    

Similar News