YS Jagan: వచ్చే నెల నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ
YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్
YS Jagan: ఇప్పటివరకు తన పూర్తి సమయాన్ని పాలనకే కేటాయించిన సీఎం జగన్ ఇప్పుడు పార్టీపై దృష్టి సారించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ బాస్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఆశీర్వాదం కోరనున్నారు. ఇక.. సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే వైసీపీ అధిష్టానం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది. 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను, 11 మందికి ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించింది. జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఇక పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డిని ఎంపిక చేసింది. వచ్చే నెల నుంచి గడప గడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరించి ఆశీర్వాదం కోరనున్నారు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు.