YS Jagan focus on Party: వైఎస్సార్ పార్టీ పటిష్టానికి ఫోకస్.. ముగ్గురికి భాద్యతలు!
YS Jagan focus on Party: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది.
YS Jagan focus on Party: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే క్రమంలో సంక్షేమ పథకాలను వరుసగా ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిట విజయవంతంగా నిలబెట్టేలా వ్యవస్థలను సరిచేస్తూ వస్తున్నారు. అవి ఒక్కొటిగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పుడు అయన పార్టీ పై ఫోకస్ చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హామీలు అన్నీ నెరవేరుస్తున్నా.. అవి పార్టీ పరంగా అంత ప్రాచుర్యంలోకి రాకపోవడం.. విపక్షాల విమర్శలను ఎదుర్కోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీని పటిష్ట పరచాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన ప్రాంతాల వారీగా ముగ్గురికి భాద్యతలు అప్పగించారు.
వైసీపీని సంస్థాగతంగా మరింతపటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం పత్రికా ప్రకటన రీలీజ్ చేసింది.
వైవీ సుబ్బారెడ్డికి.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలు… విజయసాయిరెడ్డికి.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను… సజ్జల రామకృష్ణారెడ్డికి.. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సాఆర్ కడప జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఇక తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా జగన్ నిర్ణయించారు.