YS Jagan: ఏపీలో సొంతింటికల నెరవేర్చే ప్రయత్నం
YS Jagan: జీ-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
YS Jagan: ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆదశగా తొలిప్రయత్నంలోనే 30 లక్షల మందికి ఇంటి నివేశన స్థలాలను పంపిణీచేశామన్నారు. విశాఖలో జరిగిన జీ–20 సదస్సులో తొలి రోజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతిథులతో కలిసి ముచ్చటించారు. జీ-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానన్నారు.
ఏపీలో పేదలకు సొంత ఇంటిని సమకూర్చాలనే ఉద్ధేశంతో 22 లక్షల ఇళ్లు కడుతున్నామన్నారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని కోరారు. దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై చక్కటి చర్చలు చేయాలన్నారు.