AP News: బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తులపై వైసీపీ ఫోకస్.. టికెట్ ఆశించి భంగపడిన వారే టార్గెట్‌గా వ్యూహాలు

AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది.

Update: 2024-03-29 14:00 GMT

AP News: బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తులపై వైసీపీ ఫోకస్.. టికెట్ ఆశించి భంగపడిన వారే టార్గెట్‌గా వ్యూహాలు

AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తి నేతలతో జగన్ మాట్లాడుతున్నారు. మొన్నటివరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాయినింగ్స్ అయితే... ఇప్పుడు బస్‌యాత్రలో కండువాలు కప్పుతున్నారు. స్థానికంగా బలం ఉన్న నేతలను వైస్ జగన్‌కు పరిచయం చేయించి... వైసీపీలోకి లాగేసుకుంటుంగి. ఇలా ఇడుపులపాయ టు ఇచ్చాపురం వరకు సాగే బస్ యాత్రలో బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టి... తమ అధినేత జగన్‌తో భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ తన వేట సాగిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఇంచార్జీలను మార్చిన సమయంలో కొందరు జాబితా విడుదల సమయంలో మరికొందరు పార్టీని వీడారు. అభ్యర్థుల ప్రకటన వెలువడి వారం రోజులు గడుస్తుండటంతో ఇంకా పార్టీ మారే వారు ఉండే అవకాశం లేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు మినహా అంతా సెట్ చేసుకున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీల మీద దృష్టి పెట్టింది వైసీపీ.

ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి. కూటమిలో భాగంగా ఏదైనా ఒక పార్టీకి చెందిన వ్యక్తికి మాత్రమే అవకాశం వస్తుంది. కానీ ఈ మూడు పార్టీలలో ఆశావహులు ఉన్నారు. దీంతో సీట్ల దగ్గర పేచీ వస్తోంది. టికెట్ దక్కని వారు అలకలు మొదలెట్టారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తామని పార్టీకి తేల్చి చెబుతున్నారు. కూటమి గుండెల్లో రెబెల్స్ ఇలా బెల్స్ మొగిస్తుంటే వైసీపీ జాగ్రత్తగా ఈ పరిణామాలను గమనిస్తోంది. ఆ మూడు పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి గేట్లు తెరుస్తోంది.

వైసీపీలో చేరేందుకు సుముఖంగా లేని నాయకులు... రెబెల్స్‌గానే బరిలో ఉందామనుకున్న వారికి తెర వనెక నుంచి మద్దతు సైతం ఇచ్చేందుకు వైసీపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక వైసీపీ వేటకు చిక్కే వారు ఎంతమంది అన్న చర్చ సాగుతోంది. టీడీపీలో 4 దశాబ్దాలుగా ఉండి... టికెట్ రాని నాయకులు అసంతృప్తి ఉన్నా అణచుకుంటున్నారు కానీ... బయటపడడం లేదు. టీడీపీ జెండాను చూసి పార్టీ మారేందుకు ఇష్టపడడం లేదు. వారి విషయంలో పక్కగా ప్లాన్ చేస్తుంది అధికార పార్టీ.

రాజకీయంలో ఒకే పార్టీని అంటిపెట్టుకుని ఉండటం ఈ రోజుల్లో కష్టమే. కొందరు నాయకులు ఒకసారి పిలిస్తే రాకపోవచ్చని... మరిన్ని సార్లు సంప్రదిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అంచనాలు వేస్తోంది. వీరిలో జనసేన పార్టీ నుంచి వచ్చే నేతలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గోదావరి జిల్లాకు చెందిన ఓ నేత వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారట. ఈ నెల 30న వైసీపీలో చేరుతారని సదరు నేత అభిమానులు అంటున్నారు. అదే విధంగా విశాఖలోని కీలక నేతల విషయంలోనూ వైసీపీ ఆచితూచి వ్యవహిరిస్తోంది. విజయవాడలోని కొందరు నేతలు సైతం నిరాశలోనే ఉన్నారు. వారి విషయంలోనూ మరో ప్లాన్ అమలు చేస్తోంది వైసీపీ.

Tags:    

Similar News