Andhra Pradesh: సజ్జల సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా?

*సజ్జల కావాలనే చంద్రబాబును రెచ్చగొడుతున్నారా?

Update: 2022-06-04 09:13 GMT

Andhra Pradesh: సజ్జల సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా?

Sajjala Ramakrishna Reddy Challenge: ఏపీలో బైపోల్‌ వార్‌ జరగబోతోందా? వైసీపీ సవాల్‌ను టీడీపీ స్వీకరిస్తే రాజకీయాలు మారుతాయా? ఆత్మకూరులో పోటీ చేయమని తేల్చినా వైసీపీ కావాలనే రెచ్చగొడతుందని టీడీపీ ఫీలవుతుందా? సజ్జల విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తే జరిగే పరిణామలు ఏంటి? టీడీపీ అధినేత రాజీనామా చేసి సత్తా చాటుతారా? వైసీపీ రెచ్చగొడుతుంటే, టీడీపీ తొడ కొడుతుందా? ఇదంతా చంద్రబాబును చక్రబంధనంలో ఇరికించే ఎత్తుగడా? సజ్జల కావాలనే అలా సవాల్‌ విసిరారా?

తెలుగుదేశం నేతల తీరుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ధైర్యం విశ్వాసం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ పోటీ చేసి సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు. ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

సరే రాజకీయంగా ఇలా రెచ్చగొట్టడాలు ప్రత్యర్థి నేతలు తొడగొట్టడాలు కామన్‌. మరి వైసీపీ తరుపున సజ్జల విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? తన సంప్రదాయాన్ని అటకెక్కించి ఆత్మకూరులో పోటీకి దిగుతారా? లేదా తనతో పాటు, తన పార్టీకి వచ్చిన 23 సీట్లలో పోటీకి దిగి సత్తా చాటుతారా? ఇవే ప్రశ్నలు తమ్ముళ్లను వెంటాడుతున్నాయట.

సజ్జల క్లియర్‌గా ఏమన్నారంటే ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటడం ఎందుకు ఆత్మకూరు ఉప ఎన్నిక వచ్చింది. ధైర్యం ఉంటే పోటీ చేయండి. లేదా కుప్పంతో సహా, మిగిలి ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికల్లోకి రండి అంటూ సజ్జల రెచ్చగొట్టారు. ధైర్యం, నమ్మకం ఉంటే, రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో గెలవండి అంటూ సవాల్ విసిరారు.

ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబు ఓ మాట అన్నారు. కొత్తగా వార్‌ వన్‌సైడ్‌. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామంటూ తమ్ముళ్లకు ధైర్యం నూరిపోశారు. ఈసారి నూరు శాతం విజయం తెలుగుదేశం పార్టీదే అంటూ ధీమాగా చెప్పారు. నిజంగానే చంద్రబాబు అనుకున్నదే నిజమే అయితే, ఆ విశ్వాసమే ఉంటే, ఆ ధైర్యం ఉంటే రండి ఉపఎన్నికలకు అంటోంది వైసీపీ. అయితే, చంద్రబాబు దీన్ని సవాల్‌గా స్వీకరిస్తారా ఉపఎన్నికలకు వెళ్తారా? అన్నదే పాయింట్‌గా కనిపిస్తోందిప్పుడు.

మహానాడు తర్వాత తెలుగుదేశం దూకుడు పెంచింది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజ‌ల్లోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు. అంది వచ్చే ప్రతి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. అధికారమే టార్గెట్‌గా ప‌నిచేయాల‌ంటూ తమ్ముళ్లకు సూచిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే సంకేతాలు అందినట్లు సమాచారం. ఇదంతా సరే. ఒకవేళ సజ్జల సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? స్వీకరిస్తే ఏం జరుగుతోంది? ఇదే ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

చంద్రబాబు చాన్నాళ్ల ముందు నుంచే అంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని.! అవి రానీ రాకపోనీ.! వస్తే ఎదుర్కోవడానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు అదేమీ కొత్త కాదు. కానీ, సజ్జల విసిరిన సవాల్‌ను స్వీకరిస్తే గనుక కచ్చితంగా అది టీడీపీకి నష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఆత్మకూరు ఉపఎన్నిక అంటే, అది సానుభూతి కోణంలో వదిలేద్దాం. అదే కుప్పంలో తానే రాజీనామా చేసి పోటీకి దిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టెక్కడం గగనమేనన్న చర్చ జరుగుతోంది.

అదీగాక, తాను గాక, తన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 22 మంది తామెందుకు రాజీనామా చేస్తామని ఎదురు తిరిగినా తిరగవచ్చన్నది పొలిటికల్‌ పండితుల మాట. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సిట్టింగ్‌లలో ఎందరికి టికెట్లు వస్తాయో రావో క్లారిటీ లేదు. మొన్నటి మహానాడు తీర్మానాల భయం ఎటూ వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండున్నరేళ్ల ముందే తామెందుకు రాజీనామా చేయాలని చంద్రబాబును అడిగితే ఆయన ఆన్సర్‌ చేయలేకపోవచ్చు. అందుకే ఇంత రిస్క్‌ తీసుకోవడం కరెక్ట్‌ కాదనే సజ్జల సవాల్‌పై చంద్రబాబు ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఏమైనా చంద్రబాబుతో మైండ్‌గేమ్‌లో భాగంగానే, సజ్జల ఆ సవాల్‌ను విసిరి ఉండొచ్చన్న ప్రచారం మధ్య తెలుగుదేశం క్యాంప్‌లో ఓరకమైన అలజడే రేగుతోందట. మరి, ఈ అలజడి ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Full View


Tags:    

Similar News