రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం..భర్తను లారీతో ఢీకొట్టించి..

Update: 2020-04-06 05:19 GMT

 వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హతమార్చింది. ఈ ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం (35) అనే వ్యక్తికి, 11ఏళ్ల క్రితం, రేణుకతో ప్రేమ వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌సెంటర్‌ నిర్వహిస్తున్న బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన పిల్లలతో మదనపల్లెలోనే ఉన్న రేణుకకు నాగిరెడ్డి అనే ఓ పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఇటీవల బాలసుబ్రహ్మణ్యం తిరిగి మదనపల్లెకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాడు. తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించి ఆమెను మందలించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తన భర్తను వదిలించుకోవాలని నాగిరెడ్డితో ఆమె చెప్పింది. అతను తనకు తెలిసిన వారి లారీతో ఢీకొట్టించి చంపేందుకు పథకం వేశాడు. ఇక శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు ఎక్కువ కాగా.. మాత్రలు తెచ్చుకోవాలని రాత్రి 11గంటల సమయంలో అతడిని బయటకు పంపింది. ఆ తరువాత ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అంతకుముందే పక్కా పథకం వేసుకున్న నాగిరెడ్డి తనకు తెలిసిన వారి లారీతో నాగిరెడ్డిని ఢీకొట్టించాడు.

ఈ ఘటనలో బాలసుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు.  ప్రమాదంగా భావించి న పట్రోలింగ్‌ పోలీసులు లారీ కోసం గాలించారు. నిందితులు వాల్మీకిపురం వద్ద అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. బాలసుబ్రహ్మణ్యం సోదరుడు, న్యాయవాది అయిన కె.రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేప్టటిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. ఒకటో పట్ట ణ సీఐ తమీమ్‌ అహ్మద్, ఎస్‌ఐ సోమశేఖర్‌ సిబ్బందితో వెళ్లి నిందితురాలు రేణుక, ఆమె ప్రియుడు, హంతకులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News