Botsa Satyanarayana: రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతస్తాం..

Botsa Satyanarayana: తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారా అని అడిగితే స్వాగతిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Update: 2022-12-08 11:42 GMT

Botsa Satyanarayana: రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతస్తాం..

Botsa Satyanarayana: తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారా అని అడిగితే స్వాగతిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విభజన అంశానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు మూసేయమని కోరిందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్‎ను బొత్స ఖండించారు. విభజన చట్టం సమస్యలన్నీ పరిష్కరించాలనే తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు.. సమైక్య రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే.. ముందుగా స్వాగతించేది వైసీపీయేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది వైసీపీయేనని, ఉమ్మడి ఏపీగా కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని చెప్పారు. రాష్ట్ర విభజన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారన్న సజ్జల.. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు సజ్జల. ఇప్పుడు ఈ కామెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారి తీశాయి. 

Tags:    

Similar News