AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎవరు?
నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్‌ను ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం ఉత్కంఠగా మారింది. ప్రొటెం స్పీకర్‌గా ఎవరు ఉండరున్నారనే దానిపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది.
AP Assembly: ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు పూర్తి కాగానే... అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నిక తర్వాత ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. రాబోయే ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం చేయాలనుకుంటున్న కార్యక్రమాలు వివరిస్తారు. నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్‌ను ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం ఉత్కంఠగా మారింది. ప్రొటెం స్పీకర్‌గా ఎవరు ఉండరున్నారనే దానిపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది.
శాసనసభలో కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్‌ను ప్రభుత్వం నియమిస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్‌కి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో నారా చంద్రబాబు నాయుడు అత్యంత సీనియర్. ఇప్పటికీ 9 సార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా... ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఉండేందుకు అవకాశం లేదు. ఆయన తర్వాత ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఎవరనే దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
చంద్రబాబు నాయుడు తర్వాత అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయ్యన్నపాత్రుడు 1983, 85, 94, 99, 2004, 14, 24లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక బుచ్చయ్య చౌదరి 1983, 85, 94, 99, 2014, 19, 24లో గెలుపొందారు. వీరిద్దరిలో ప్రొటెం స్పీకర్ అవకాశం ఎవరిని వరించనుందో అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపికైన వ్యక్తి కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. స్పీకర్ ఎన్నిక తర్వాత ఆయన్ను సభాపతి స్థానంలో కుర్చేబెట్టడంతో ఆయన పని పూర్తి అవుతుంది.