AP Weather: ఏపీకి తుఫాన్ ముప్పు

AP Weather: సాయంత్రానికి వాయుగుండంగా మార్పు.. ఎల్లుండి తుఫాన్‌గా మారే అవకాశం

Update: 2022-12-06 03:40 GMT

AP Weather: ఏపీకి తుఫాన్ ముప్పు

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందంటున్నారు. ఈ నెల 8న తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాన్‌కు వాతావరణశాఖ మాండస్‌గా పేరు పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ తుఫాన్ బలపడితే ఏపీపై ప్రభావం ఉంటుంది అంటున్నారు. రేపటి నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది.

ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగా.. ఉత్తర కోస్తాలో స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు.. దక్షిణ కోస్తాలో రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఎల్లుండి దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయంటున్నారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News