Weather Updates: నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Weather Updates: నేడు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Updates: నేడు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాకాతంలో ఒడిష తీరం దగ్గర అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కుడా ఉంది. రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించింది. తెలంగాణాలో ఋతుపవనాల కదలికలు సాధారణంగానే ఉన్నాయి. దీంతో రానున్న మూడు రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుండి తేలిక పతి వర్షాలు కురిసే అవకాసం ఉంది. అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయి అని అధికారు తెలిపారు.
అయితే, అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాలు అతలాకుతలం కాగా.. తాజా వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక మరోవైపు ఏపీలో ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. దీంతో నేతిని దిగివకు విడుదల చేస్తున్నారు అధికారులు.. అంతే కాదు కృష్ణ పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.