వృక్షా బంధన్..చెట్లకు రాఖీలు కడుతున్న పర్యావరణ ప్రియులు

Update: 2019-08-14 06:26 GMT

రాఖీ పండుగ రోజు అన్న చేతికి రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకుంటారు. కష్టసుఖాలలో తోడునీడై అన్న వుండాలని కోరుకుంటారు. కాని విశాఖ‌ లో కొంతమంది మహిళలు, విద్యార్థినులు చెట్టుకు రాఖీ కట్టి వృక్షా బంధన్ ను జరుపుకుంటున్నారు. రక్షా బంధన్ అందరీకి తెలుసు, మరి మీరు ఈ వృక్షా బంధాన్ కథ ఏమిటో చూడండి..

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆడపడుచులు సొదరులకు రాఖీ కట్టి రక్షణ గా వుండాలని తమను పదికాలల పాటు చల్లగా చూడాలని కోరుకుంటారు. కాబట్టే రాఖీ పండుగ ను రక్షా బంధన్ గా పిలుస్తారు. అలాగే ప్రకృతిలో మమేకమైన మనిషికి వృక్షాలు అన్నలా అండగా వుంటాయి. స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు ఫలాలు ఇస్తాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాడు. చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని కొందరు విశాఖవాసులు గుర్తించారు. రక్షా బంధన్ ను వృక్షా బంధన్ గా నిర్వహిస్తున్నారు. ఏటా రాఖీ పండుగ రోజు విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడుతున్నారు.

చెట్లకు కడుతున్న ఈ రాఖీలను విత్తనాలతో తయారుచేస్తారు. చెట్ల కొమ్మలకు రాఖీలుగా కడతారు. పక్షులు విత్తనాలు తిని మట్టిలో విసర్జించడంతో మళ్లీ మొలకలు ఎత్తుతాయి. చెట్లుగా మారుతాయి. హరితహారంతో అందాల విశాఖను పర్యావరణరహితనగరంగా మార్చుకోవచ్చని పర్యావరణ ప్రియులు చెబుతున్నారు. రాక్ష బంధన్ ను వృక్షా బంధన్ గా జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేస్తున్న విశాఖవాసులు అభినందనీయులు.

Full View 

Tags:    

Similar News