Vizag gas leak updates: ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది అరెస్ట్!
Vizag gas leak updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణంగా పెర్కొంటూ సంస్థ సీఈవో సున్‌కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావులతో సహా మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్(Vizag gas leak updates)లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణంగా పెర్కొండూ సంస్థ సీఈవో సున్‌కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావులతో సహా మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు.(నిర్లక్ష్యంతోనే ఎల్జీ పాలిమర్స్ లో భారీ ప్రమాదం)
నిన్ననే ఈ ఘటనపై హైపర్ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ నివేదికలో నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది.
దుర్ఘటన జరిగిన మే 7నే ఎల్‌జీ పాలిమర్స్ సంస్థపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కమిటీ నివేదిక అనంతరం ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.