Visakhapatnam: విశాఖ మత్స్యకారుల గేలానికి చిక్కిన భారీ తిమింగలం
Visakhapatnam: *తీరానికి చేరగానే చనిపోయిన తిమింగలం *తిమింగలం బరువు సుమారు 12వందల కిలోలు
Visakhapatnam: విశాఖ జిల్లాలోని సముద్ర తీరంలో మత్స్యకారుల గేలానికి భారీ తిమింగలం చిక్కింది. అచ్యుతాపురం మండలంలోని తండి శివారు వాడపాలెంలో మత్స్యకా రుల గేలానికి తిమింగలం చిక్కింది. అయితే అది ఒడ్డుకు చేర్చిన వెంటనే చనిపోయింది. పడవలో వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు వేసిన గేలానికి బరువుగా తగిలింది.. పెద్ద చేపనే పడి ఉంటుందని సంబరపడ్డారు. గేలాన్ని పడవలోనికి లాగేందుకు వీలు కాలేదు.. దీంతో పడవలో ఉన్న తాడు సాయంతో సాయంత్రానికి తీరానికి చేర్చారు. తీరా చూస్తే అది భారీ తిమింగలం. దీని బరువు సుమారు వెయ్యి నుంచి 12వందల కిలోల బరువు ఉంటుంది. దీనిని పప్పరమేను అంటారని మత్స్యకారులు చెప్తున్నారు. ఇది తినడానికి పనికి రాదు.. అయితే దీని నుంచి వచ్చే నూనెలో చాలా ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు.