Visakhapatnam: చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో అమానుషం
Visakhapatnam: విశాఖజిల్లా చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులతో డ్రైనేజీ శుభ్రం చేయించిన ఘటన కలకలం రేపుతుంది.
Visakhapatnam: తరాలు మారుతున్న.. టెక్నాలజీ పరుగులు పెడుతున్నా.. వారి జీవితాల్లో మార్పు రావడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సినవారే విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేవారే క్రమశిక్షణ తప్పి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. అవును.. విశాఖ జిల్లా చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులతో డ్రైనేజీ శుభ్రం చేయించిన ఘటన కలకలం రేపుతుంది.
మోకాళ్లలోతు బురద నీటిలో దిగిన బాలికలు...
లాక్‌డౌన్ తర్వాత పాఠశాలలు ప్రారంభవడంతో హాస్టల్ కిచెన్ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలతో స్కూల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ నిండిపోయింది. దీంతో దుర్వాసన ఎక్కువైంది. అయితే మున్సిపల్ సిబ్బందితో క్లీన్ చేయించాల్సింది పోయి.. అక్కడి స్థానికులు, హాస్టల్ సిబ్బంది ఆడపిల్లలు అని కూడా చూడకుండా.., ఆపై రాత్రి సమయంలో డ్రైనేజీలోకి దింపారు. మోకాళ్ల లోతు ఉన్న బురద నీటిలో దింపి శుభ్రం చేయించారు.
హాస్టల్ వార్డెన్ తీరుపై ఆదివాసి సంక్షేమ సంఘం సీరియస్...
ఈ విషయం కాస్త ఆదివాసి సంక్షేమ సంఘం నేతల వరకు వెళ్లింది. దీంతో హాస్టల్‌కు వచ్చిన అధికారిణి.. జరిగిన విషయంపై స్వయంగా విద్యార్థినులను అడిగి తెలుసుకుంది. తమ హాస్టల్ పక్కన ఉన్న ఇంటివారే తీయించారని విద్యార్థినులు సదరు అధికారిణికి తెలియజేశారు. దీంతో విద్యార్థినులపై సదరు మహిళా ఉద్యోగి మండిపడ్డారు. ఎవరు చెబితే వాళ్లు పనిచేయమ్యంటే చేస్తారా..? చదువుకోవడానికి వచ్చారా..? లేక పనిచేయడానికి వచ్చారా..? అంటూ ప్రశ్నించింది.
పొంతలేని సమాధానం చెబుతున్న హాస్టల్ వార్డెన్...
ఇదిలా ఉండగా.. రాత్రి సమయంలో ఆడపిల్లలు హాస్టల్‌లో ఉండకుండా బయట ఉంటే మీరు ఏం చేస్తున్నారంటూ.. హాస్టల్ వార్డన్‌పై సీరియస్ అయ్యింది మహిళా ఉద్యోగి. ఇంత జరిగానా కూడా పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా.. విద్యార్థినులతో పనులు చేపిస్తారా అంటూ నిలదీసింది. పొంతన లేని సమాధానాలు చెబితే బాగోదంటూ హెచ్చరించింది. ఈ విషయంపై అధికారులకు కంప్లైంట్ చేస్తానని.. హాస్టల్ వార్డన్‌ది కూడ తప్పుఉంటే యాక్షన్ తీసుకుంటానని చెప్పారు మహిళా ఉద్యోగి.