థియేటర్లకి ఏపీ ప్రభుత్వం అనుమతి.. ఏపీ ఆన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ఇవే!
Unlock 5.0 Guidelines : కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా ఆన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి ధియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది.
Unlock 5.0 Guidelines : కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా ఆన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి ధియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ పార్కులకి, క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి స్విమ్మింగ్ ఫూల్స్ కి అనుమతిస్తామంది. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి తోనే స్కూల్ లోకి అనుమతి ఇవ్వాలని, ఎక్కువగా ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలల తర్వాత ఏపీలో మళ్లీ ధియేటర్లు తెరుచుకొనున్నాయి. అటు కేంద్రం ఇప్పటికే ధియేటర్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. అయితే 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.