Tirumala Laddu: ఇకపై ఆధార్ కార్డు ఉన్నవారికే శ్రీవారి లడ్డూ ప్రసాదం..అదనపు లడ్డూలు కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి..

Tirumala Laddu:

Update: 2024-08-30 03:51 GMT

TTD Laddu: టీటీడీ కీలక నిర్ణయం..ఇక ఎన్ని లడ్డూలు తీసుకోవాలో క్లారిటీ

Tirumala Laddu:తిరుమలలో ఇకపై లడ్డు పంపిణీ విషయంలో కీలక మార్పులు రానున్నాయి. శ్రీవారి లడ్డు ప్రసాదం బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఇకపై దర్శనం టికెట్టు ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి లడ్డూలు అందజేసేలా నూతన విధానాన్ని తిరుమలలో అమలు చేయనున్నారు. దీంతో దళారీ వ్యవస్థను నియంత్రణ చేయవచ్చని టీటీడీ భావిస్తోంది. కొత్తగా తెచ్చిన నిబంధనలో ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్ పైన ఒక ఉచిత లడ్డు లభిస్తుంది. అలాగే ఆధార్ కార్డు చూపించిన వారికి మాత్రం 100 రూపాయలు చెల్లిస్తే రెండు లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.

రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను నాలుగు నుంచి ఆరు వరకు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. చాలా సందర్భాల్లో తిరుమలలో రద్దీ కారణంగా దర్శనం అనంతరం భక్తులు లడ్డూలు దొరకపోవడంతో దళారుల వద్ద కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీన్ని నివారించేందుకే టిటిడి చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ నూతన నిబంధనలో అధిక రద్దీ సమయంలో ఒక్కోసారి దర్శనం చేసుకునే వీలు లేకపోతే భక్తులు వారి ఆధార్ కార్డు పై వంద రూపాయలు చెల్లించి రెండు లడ్డులను పొందవచ్చు

. లడ్డు కౌంటర్లు ఇకపై ఆధార్ కార్డును నెంబర్ నమోదు చేసి రెండు లడ్డు విక్రయిస్తారు. నూతన లడ్డు విధానం గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దళారులను అరికట్టేందుకే ఈ వ్యవస్థను తెచ్చినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.

గతంలో లడ్డూలను దళారులు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు. తిరుమల లో లడ్డు ప్రసాదం అనేది చాలా ఫేమస్. దీన్ని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎంత డబ్బు అయినా చెల్లించేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అదనపు లడ్డూల విషయంలో ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది.

అయితే ఈ దళారీ వ్యవస్థ వల్ల టీటీడీ పెద్ద ఎత్తున నష్టపోతోంది. గతంలో భక్తులకు అదనపు లడ్డూల కోసం ఎక్కువగా నిబంధనలు ఉండేవి కావు దీన్ని ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెటీర్లు లడ్డూలను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నూతన పాలకమండలి. ఆధార్ కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Tags:    

Similar News