Tirumala Tirupati: టీటీడీకి అరుదైన వరల్డ్ రికార్డ్..

Tirumala Tirupati: టీటీడీ అరుదైన ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకుంది.

Update: 2021-11-13 16:00 GMT

Tirumala Tirupati: టీటీడీకి అరుదైన వరల్డ్ రికార్డ్..

Tirumala Tirupati: టీటీడీ అరుదైన ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ లేని విధంగా భక్తులకు విశేష సేవలందిస్తున్నందున ఇంగ్లాండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆ సర్టిఫికెట్ ను వాల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతనిధులు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందచేశారు. టీటీడీ ఉద్యోగుల కృషితోనే ఈ రికార్డ్ సాధ్యమైందన్నారు వై వీ సుబ్బారెడ్డి. సాధారణ రోజుల్లో తిరుమలలో 60వేల నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు.

క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకుపైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ తెలిపారు. టీటీడీలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్టపడి చేస్తున్నారని, ఈ క్రమంలోనే గుర్తింపు వచ్చిందని చైర్మన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News