TTD: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం

TTD: భక్తుల రక్షణ కోసం అడుగడుగునా సిబ్బంది పహారా ఉంటుంది

Update: 2023-09-06 12:10 GMT

TTD: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం

TTD: తిరుపతిలోని అలిపిరి నడక మార్గంలో భక్తులకు టీటీడీ కర్రలను పంపిణీ చేసింది. కొండపైకి వెళ్లే భక్తులకు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి కర్రలను అందజేశారు. నడకదారిలో వెళ్లే భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసమే కర్రలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. చేతి కర్ర ఇచ్చి ..టీటీడీ చేతులు దులుపుకోదని భూమన వెల్లడించారు. భక్తుల రక్షణ కోసం అడుగడుగునా సిబ్బంది పహారా ఉంటుందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద భక్తులు కర్రలు తిరిగి ఇవ్వాలని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News