TTD: సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నాం

*పాలకమండలి లేనప్పుడు అధికారులు నిర్ణయం తీసుకున్నారు *స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని నిర్ణయం

Update: 2021-08-30 03:30 GMT

సంప్రదాయ భోజనంపై వెనక్కి తగ్గిన టీటీడీ (ఫైల్ ఫోటో)

TTD: సంప్రదాయ భోజనంపై తిరుమల తిరుపతి దేవస్థానం వెనక్కు తగ్గింది. డబ్బులు తీసుకొని భోజనం పెట్టాలంటూ టీటీడీ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నామని పాలకమండలి లేనప్పుడు అధికారులు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని తిరుమలలో అన్నప్రసాదం ఉచితంగా అందిస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

Tags:    

Similar News