TTD: తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డుపై ఆ రోజు బైకులు నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం

TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. అయితే తాజాగా గరుడ సేవకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 8వ తేదీ టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గరుడ సేవ రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అడ్డుకట్ట వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-06 01:00 GMT

ముఖ్యంగా గరుడసేవ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 8వ తేదీన కొండపైకి వెళ్లే రెండు ఘాట్ రోడ్డు మార్గాలలోను ద్విచక్ర వాహనాలు రాకపోకులను నిషేధిస్తూ తీర్మానం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన కీలకమైన గరుడ సేవ జరగనుంది. ఆ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది.

అయితే అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్ల పైన ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ముందుగానే ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో భక్తులు గమనించి ద్విచక్ర వాహనాలను ఆరోజు కొండపైకి తీసుకొని రావద్దని టీటీడీ కోరింది. అలాగే భక్తులు ఆరోజు సహకరించాలని టిటిడి పేర్కొంది.

ఇక ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే అక్టోబర్ 4వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రజారోహణం కార్యక్రమం తో ప్రారంభం కానున్నాయి. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ముఖ్యంగా ధ్వజస్తంభం పైన గరుడ పతాకం ఎగిరేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. వేదమంత్రాలు ఉచ్చరణలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ కట్టి దర్భలతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుట్టి పెడతారు. అయితే దర్భలతో కూడిన చాపను తాడును తయారు చేయడానికి ఇప్పటికే టిటిడి శాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేసి పెట్టింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు వాహన సేవలు ఉంటాయి. అక్టోబర్ 8వ తేదీన గరుడసేవ ఉంటుంది. అలాగే అక్టోబర్ 9వ తేదీన స్వర్ణ రథం 11వ తేదీన రథోత్సవం, 12వ తేదీన చక్రస్నానం ఉంటాయి. ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవం సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Tags:    

Similar News